సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వల్ గా వస్తున్న సినిమా బంగార్రాజు.కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్నారు.
నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి నటిస్తున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా లడ్డుండ పాట రిలీజై మంచి హిట్ అయ్యింది.ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది.
నాగ చైతన్య, కృతి శెట్టిల మధ్య లవ్ సీన్స్ మైసూర్ లో షూట్ చేస్తున్నారట.

ఉప్పెన సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి వరుసగా క్రేజీ సినిమాలు చేస్తుంది.ఈ క్రమంలో సుధీర్ బాబు, నాని, రామ్, నితిన్ సినిమాల్లో ఛాన్స్ అందుకుంది కృతి శెట్టి.ఈ సినిమాలతో పాటుగా బంగార్రాజు సినిమా కూడా క్రేజీగా వస్తుంది.
ఈ సినిమాలో నటించేందుకు గాను కృతి శెట్టి భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుందని తెలుస్తుంది.మొత్తానికి ఒక్క సినిమాతోనే కృతి శెట్టి డిమాండ్ ఈ రేంజ్ లో ఉండటం చూసి మిగతా హీరోయిన్స్ షాక్ అవుతున్నారు.
ఆమె చేస్తున్న సినిమాలన్ని రిలీజైతే ఇప్పుడున్న కృతి శెట్టి క్రేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉంది.