రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.గతంలో నిరాహారదీక్షలు అనేక రోజుల నుండి చేపట్టగా తాజాగా ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేపట్టడంతో చాలా మంది అమరావతి రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా మద్దతు తెలిపారు.అంత మాత్రమే కాక పాదయాత్రలో పాల్గొన్న లేనివారు సోషల్ మీడియా ద్వారా సంఘీభావం తెలపాలని కోరారు.
రైతుల పాదయాత్రను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి పోలీసు వ్యవస్థను వాడుకుంటోందని ఆరోపణలు చేశారు.
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతించారని అదేరీతిలో తర్వాత జగన్ పాదయాత్ర కి కూడా.చంద్రబాబు ఎక్కడ అడ్డంకులు పెట్టలేదని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
అంత మాత్రమే కాక తెలంగాణలో జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పాదయాత్రకు జగన్ ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నాలు చేయగా హైకోర్టుకు వెళ్లి అమరావతి రైతులు అనుమతి తెచ్చుకున్నారని పేర్కొన్నారు.అయినప్పటికీ కొత్త ఆంక్షల పేరుతో రైతుల పాదయాత్రకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారని ఈ క్రమంలో పోలీసులు వ్యవస్థను.వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.