భూమిపై ఇప్పటికే ఎన్నో వింతలు జరిగాయి.ఇక కొన్ని కొన్ని వింతలు పుట్టుకొస్తున్న కూడా జరిగేదేదో జరుగుతుందన్నట్లు ప్రజలు కూడా చూసి పట్టించుకోవడం లేదు.
ఇక జరిగిన వింతలలో ఎన్నో ఆశ్చర్యానికి గురి చేయగా.అందులో ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోయిన్ కూడా తన సహనటితో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టెవర్ట్.
ఇక ఈమె సూపర్ మోడల్ గా నిలిచింది.ఇక గతంలో తన సహ నటుడుతో డేటింగ్ చేసి వదిలేసింది.
ఇక గత కొన్ని సంవత్సరాల నుండి తాను తన సహనటి డైలాన్ మేయర్ తో డేటింగ్ లో ఉందని తెలిసింది.పైగా ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని తాజాగా క్లారిటీ ఇచ్చింది క్రిస్టెన్.
తాజాగా ఓ షోలో గెస్ట్ గా పాల్గొని వ్యక్తిగత విషయాలు పంచుకుంది.త్వరలో తను, డైలాన్ వివాహం చేసుకోబోతున్నామని, ఒకరికోసం ఒకరం జీవించాలి అనుకుంటున్నామని తెలిపింది.

ఒకరి కోసం ఒకరు తామే మారమని తెలిపింది.ఇక త్వరలోనే పెళ్లి చేసుకుంటామని అందరి ముందు క్లారిటీ ఇచ్చేసింది.

ఇక వారి మధ్య మంచి అనుబంధం ఉందని.తనతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు అందరు తమను ఫోటో తీయడానికి బాగా ప్రయత్నించినా కూడా పట్టించుకోనని తెలిపింది.జనాలు తన గురించి తన ఫోటోలు చూస్తున్నారంటూ, వార్తలు చదువుతున్నారు అంటూ కొన్ని విషయాలు తెలిపింది.తాను చిన్నతనంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తనలా బాధ పడేవారిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది.