నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల డైరక్షన్ లో వస్తున్న సినిమా దసరా.ఈ దసరాకి ఫస్ట్ లుక్ టీజర్ తో వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
అయితే సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో సమంత కూడా నటిస్తుందని టాక్.ఆఫ్టర్ మ్యారేజ్ వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్న సమంత లేటెస్ట్ గా నాగ చైతన్యతో డైవర్స్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
అందుకే ఇక మీదట తన ఫుల్ ఫోకస్ సినిమాల మీద పెట్టాలని చూస్తుంది.
నాని దసరా సినిమాలో సమంత పాత్ర చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని అంటున్నారు.
తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడుతారని తెలుస్తుంది.తప్పకుండా నాని దసరా సినిమా తన కెరియర్ లో ఒక కొత్త ప్రయత్నమని చెప్పొచ్చు.
ప్రస్తుతం నాని శ్యాం సింగ రాయ్ పూర్తి చేసి అంటే సుందరానికీ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.శ్యాం సింగ రాయ్ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించారు.