పవన్ తో సినిమాపై జక్కన్న ఆసక్తికర కామెంట్స్!

మన టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు.ఈయన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Rajamouli Interesting Comments On Movie With Pawan Kalyan, Pawan Kalyan,rajamoul-TeluguStop.com

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసిన బాహుబలి సినిమాతో అటు ప్రభాస్ స్టార్ డమ్ ఇటు రాజమౌళి స్టార్ డమ్ అమాంతంగా పెరిగాయి.రాజమౌళి ఇక నుండి అన్ని పాన్ ఇండియా సినిమాలే చేయబోతున్నాడు.

ఈయన ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Telugu Pawan Kalyan, Rajamouli, Rajamoulipawan, Ram Charan, Tollywood-Movie

టాలీవుడ్ యంగ్ హీరోస్ అయినా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా 350 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది.ఇక ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీలు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే.

అయితే ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఎట్టకేలకు ఈ సినిమాను సంక్రాంతికి జనవరి 7న విడుదల చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో మెగా అభిమానులు రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ విషయంపై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

పవన్ తో సినిమా ఇప్పటి వరకు చేయక పోవడానికి గల కారణాలు, ఎదురయినా పరిస్థితుల గురించి క్లారిటీగా చెప్పారు.శ్రీకాకుళం లోని ఒక ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వెళ్లిన రాజమౌళి ని అక్కడ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబు చెప్పాడు.

అందులో భాగంగా ఒక మెగా అభిమాని పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని అడగగా ఆసక్తికర సంమాధానం చెప్పాడు.పవన్ తో సినిమా చేయడానికి చాలా సంవత్సరాలు వైట్ చేసానని.

ఒకసారి మూవీ షూట్ లో ఉన్నప్పుడు పవన్ ని కలిసి మీతో సినిమా చేయాలనీ ఉందని అడిగాడట.ఆయన ఎలాంటి సినిమా చేయడానికైనా రెడీ అని చెప్పాడు.

ఆ తర్వాత మంచి కథ రెడీ చేసుకుని ఆయనకు వినిపించాలని అనుకున్నాను కానీ అయన దగ్గర నుండి ఎలాంటి కబురు లేదు.

Telugu Pawan Kalyan, Rajamouli, Rajamoulipawan, Ram Charan, Tollywood-Movie

ఆ తర్వాత నేను మగధీర, యమదొంగ వంటి సినిమాలు చేశాను.మా ఇద్దరి థింకింగ్ మారిపోయింది.ఆయనకు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది.

సో ఐ లవ్ హిం ఏ లాట్..

ఐ రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్ .కాకపోతే మేము ఇద్దరం రెండు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నాము.మా ఇద్దరివీ విభిన్నమైన దారులు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.ఇక రాజమౌళి కామెంట్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనట్టే కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube