పవన్ తో సినిమాపై జక్కన్న ఆసక్తికర కామెంట్స్!

మన టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు.ఈయన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసిన బాహుబలి సినిమాతో అటు ప్రభాస్ స్టార్ డమ్ ఇటు రాజమౌళి స్టార్ డమ్ అమాంతంగా పెరిగాయి.

రాజమౌళి ఇక నుండి అన్ని పాన్ ఇండియా సినిమాలే చేయబోతున్నాడు.ఈయన ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

"""/"/ టాలీవుడ్ యంగ్ హీరోస్ అయినా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమా 350 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది.

ఇక ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీలు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే.

అయితే ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఎట్టకేలకు ఈ సినిమాను సంక్రాంతికి జనవరి 7న విడుదల చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో మెగా అభిమానులు రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ విషయంపై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.పవన్ తో సినిమా ఇప్పటి వరకు చేయక పోవడానికి గల కారణాలు, ఎదురయినా పరిస్థితుల గురించి క్లారిటీగా చెప్పారు.

శ్రీకాకుళం లోని ఒక ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వెళ్లిన రాజమౌళి ని అక్కడ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబు చెప్పాడు.

అందులో భాగంగా ఒక మెగా అభిమాని పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని అడగగా ఆసక్తికర సంమాధానం చెప్పాడు.

పవన్ తో సినిమా చేయడానికి చాలా సంవత్సరాలు వైట్ చేసానని.ఒకసారి మూవీ షూట్ లో ఉన్నప్పుడు పవన్ ని కలిసి మీతో సినిమా చేయాలనీ ఉందని అడిగాడట.

ఆయన ఎలాంటి సినిమా చేయడానికైనా రెడీ అని చెప్పాడు.ఆ తర్వాత మంచి కథ రెడీ చేసుకుని ఆయనకు వినిపించాలని అనుకున్నాను కానీ అయన దగ్గర నుండి ఎలాంటి కబురు లేదు.

"""/"/ ఆ తర్వాత నేను మగధీర, యమదొంగ వంటి సినిమాలు చేశాను.మా ఇద్దరి థింకింగ్ మారిపోయింది.

ఆయనకు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది.సో ఐ లవ్ హిం ఏ లాట్.

ఐ రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్ .కాకపోతే మేము ఇద్దరం రెండు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నాము.

మా ఇద్దరివీ విభిన్నమైన దారులు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.ఇక రాజమౌళి కామెంట్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనట్టే కనిపిస్తుంది.

ప్రియుడు విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిన తమన్నా… సోషల్ మీడియా ఫోటోలు డిలీట్?