ఒక్క వార్త ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.అదే పునీత్ మరణం.
కన్నడ పవర్ స్టార్ గా ఆ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పునీత్ రాజ్ కుమార్ చనిపోవడం నిజంగా కన్నడ ప్రజలకు శోకసంద్రాన్ని మిగిల్చిందనే చెప్పాలి.నిజానికి ఈ ఏడు సెలబ్రిటీ మరణాలలో ఇది చాలా పెద్దది అనే చెప్పుకోవాలి.46 ఏళ్లకే పునీత్ చనిపోవడంతో దక్షిణాది ప్రజలు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.ఆయన మరణాన్ని నిజంగా ఎవ్వరూ ఊహించలేదు.
కానీ ఆయన ఇంత త్వరగా మరణించడం మాత్రం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది.ఎందుకంటే ఆయన హీరోగా కన్నా మంచి మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నారు.
దశాబ్దాలుగా కన్నడ పరిశ్రమలో పునీత్ తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు.అయితే ఆయన రెండు రోజుల క్రితమే భజరంగీ 2 ప్రీ-రిలీజ్ వేడకలో ఎంతో ఆనందంగా డ్యాన్ష్ కూడా చేశారు.
స్టేజిపై తన అన్నయ్య శివరాజ్ కుమార్ అలాగే రాక్ స్టార్ యష్ తో కలిసి స్టెప్పులేసిన వీడియోను అక్కడి స్థానిక వార్తా ఛానెళ్లు విపరీతంగా ప్రచారం కూడా చేశాయి.అదే సమయంలో కొన్ని మీడియా ఛానెళ్లు ఆయన మరణ వార్తను తట్టుకోలేకపోతున్నాయి.
ఇదే క్రమంలో ఒక టీవీ యాంకర్ కూడా లైవ్ లోనే పునీత్ మీద తనకున్న అభిమానానికి ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేక ఏడ్చేసింది.
మొన్న జరిగిన ఆయన మరణ వార్తను కన్నడ న్యూస్ ఛానెల్ కవర్ చేసింది.అయితే యాంకర్ ఆ వార్తను చదువుతూ సడెన్ గా లైవ్ లోనే కన్నీళ్ల పర్యంతం కావడం బయటకు వచ్చింది.అయితే ఆమె కొద్ది సేపు అలాగే ఏడుస్తూ ఉండటం కూడా అందులో కనిపించింది.
కొద్ది సేపటి తర్వాత సిబ్బంది ఆమె వద్దకు వచ్చి లేపి ఓదార్చి మళ్లీ వార్తను చదవడం కంటిన్యూ చేయించారు.ఇదంతా కూడా లైవ్ లోనే టెలికాస్ట్ కావడంతో దాన్ని చూసిన పునీత్ అభిమానులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు.
గొప్ప నటుడిగానే కాకుండా మనసున్న మంచి మనిషిని కూడా దూరం చేసిందంటూ బాధ పడుతున్నారు.