సీఎంఓ అధికారులతో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు.అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జగన్ సీఎం అయ్యాక ఉద్యోగుల ప్రాధాన్యం పెరిగింది.
ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉంది.సంక్షేమంలో తమ ప్రభుత్వం రెండు అడుగుల ముందే ఉంది.
కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చిన్న చిన్న సమస్యలు వచ్చాయి.ఈ నెలాఖరుకు పీఆర్‌సీతో సహా సమస్యలను పరిష్కరిస్తాం.ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదు.