ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌వ‌న్ ఫోక‌స్‌.. టీడీపీకి ఇబ్బందులేనా..?

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

వైసీపీ ప్రభుత్వం, మంత్రులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే జనసేన నేతలు, శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.

గాంధీ జయంతి సందర్భంగా రోడ్ల బాగు కోసం పవన్ శ్రమదానం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.వేసీపీ మంత్రులు, నేతలు, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు కౌంటర్ ఇచ్చారు.2024లో వచ్చేది జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.ఎన్నికల యుద్ధంతో వైసీపీతో బలంగా పోరాడేందుకు జనసేన సిద్ధమని ప్రకటించారు.

కాగా, పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కాగా, తన అన్న మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన తిరుపతి సీటు నుంచి ఈ సారి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.అయితే, పవన్ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలను దాటి రారని, అక్కడ జనసేన బలంగా ఉందని మరి కొందరు చర్చించుకుంటున్నారు.2019 ఎన్నికల్లో మాదిరిగా రెండు స్థానాల్లో పోటీ చేస్తారా లేదా సింగిల్ సీటులోనే పోటీ చేస్తారా అని చర్చించుకుంటున్నారు.2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండింటా ఓడిపోయారు.ఈ క్రమంలో గాజువాకలో మళ్లీ పోటీ చేయాలని జనసేన శ్రేణులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డికి వచ్చే సారి టికెట్ ఇవ్వబోరని ప్రచారంలో ఉంది.అయితే, టీడీపీతో పొత్తు కుదిరితే తప్పకుండా పవన్ గాజువాక నుంచి పోటీ చేస్తారని స్థానిక రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

ఇందుకు ప్రధాన కారణం 2019 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో వైసీపీ కంటే టీడీపీ, జనసేనకు ఎక్కువ ఓట్లు లభించాయని చెప్తున్నారు.

ఇకపోతే టీడీపీకి కంచుకోటలా ఉన్న విశాఖ జిల్లా సాగర తీరంలోని భీమిలిపై జనసేన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఎమ్మెల్యే సీటు గెలుచుకుంటూనే వస్తున్నది.సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పవన్ పోటీకి రెడీ అన్నారని తెలుస్తోంది.

జనసేన 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 25 వేల ఓట్లు దక్కించుకుంది.కొత్త అభ్యర్థి అయినా అన్ని ఓట్లు దక్కించుకోగలిగినప్పుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తే గెలుపు ఖాయమని పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

అయితే, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అధికారికంగా అయితే ఇప్పుడే ఏం చెప్పలేమని జనసేన నేతలు పేర్కొంటున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు