సాధారణంగా మొబైల్ ఫోన్ లో మాట్లాడాలంటే మనం వాడుకునే సిమ్ కు రీఛార్జి చేస్తాము.అదే విద్యుత్ వాడుకోవాలంటే వాడుకున్న తరువాత కరంట్ బిల్ కడతాము.
ఇది పాత మాట.ఇప్పుడు కొత్త మాటేంటి అంటే.సెల్ ఫోన్ వలే రీఛార్జ్ లాగా విద్యుత్ రీఛార్జ్ చేసుకునే విధానం అమల్లోకి రానుంది.ఇక నుండి విద్యుత్ వాడుకోవాలంటే కూడా రీఛార్జి చేసుకోవాల్సిందేనని, అందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కొత్తగా ఇచ్చే కన్నెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు.ప్రీపెయిడ్ కరంట్ మీటర్లను సెల్ ఫోన్లు, డీటీహెచ్ లకు ఎలా ఆన్లైన్ లో రీఛార్జి చేసుకుంటామో అలా విద్యుత్ రీఛార్జి చేసుకునేలా రూపొందించారు.
దీనికి కోసం ముందుగా మనం ప్రీపెయిడ్ కార్డు తీసుకోవాలి.దానిని మీటర్ లలో అమర్చితే విద్యుత్ సరఫరా అవుతుంది.
బ్యాలెన్స్ ఎంత ఉందో ముందుగానే తెలుసుకుని రీఛార్జి చేయించుకొవచ్చు.ఒకవేళ రీఛార్జి చేసుకోకుంటే విద్యుత్ నిలిచిపోతుంది.
ఇందుకోసం విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఆర్ధికంగా భారమని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం కోరింది.అయితే కేంద్ర ప్రభుత్వం 15% సబ్సిడీ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం 50 నుంచి 60% ఇవ్వాలని నిర్ణయించుకుంది.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా స్మార్ట్ మీటర్లను తీసుకొస్తుంది.
![Telugu Central, Electric Meter, Latest, Prepaid, Prepaidsmart, Telangana, Vk Sin Telugu Central, Electric Meter, Latest, Prepaid, Prepaidsmart, Telangana, Vk Sin](https://telugustop.com/wp-content/uploads/2021/09/telangana-government-to-deploy-smart-electric-meters-in-every-houses.jpg )
దీంతో విద్యుత్ ప్రసార, పంపిణీ, వాణిజ్య నష్టాలు తగ్గుతాయని భావిస్తోంది.సాంకేతిక, వాణిజ్య పర విద్యుత్ నష్టాలు (ఏటి అండ్ సీ) 15% కన్నా ఎక్కువ ఉన్న విద్యుత్ డివిజన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు అందరికి 2023 డిసెంబర్ నాటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం నిర్దేశించింది.గడువు లోగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే.వాటి వ్యయం లో 15 శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొంది.అయితే గడువు లోగా మీటర్ల ఏర్పాటు పూర్తి కాకుంటే ప్రోత్సవాహకాన్ని చెల్లించబోమని స్ఫష్టం చేశారు.
![Telugu Central, Electric Meter, Latest, Prepaid, Prepaidsmart, Telangana, Vk Sin Telugu Central, Electric Meter, Latest, Prepaid, Prepaidsmart, Telangana, Vk Sin](https://telugustop.com/wp-content/uploads/2021/09/telangana-government-to-deploy-smart-electric-meters-in-every-housea.jpg )
2025 మార్చి లోగా వ్యవసాయ రంగం మినహా అన్నింటికీ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని డిస్కంలను ఆదేశిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఈఆర్సీలకు అంతకముందే విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్ సూచించారు.అయితే స్మార్ట్ మీటర్లతో పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.గతంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బిగించిన స్మార్ట్ మీటర్ల అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యిందని అధికారులు చెబుతున్నారు.