తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి కామెడీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నారు.
ఇప్పటికీ టీవీలలో రాజేంద్రప్రసాద్ సినిమాలు వస్తున్నాయంటే కన్నార్పకుండా చూసేంతగా ప్రేక్షకులను తన నటన ద్వారా కట్టిపడేసారు.ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన రాజేంద్రప్రసాద్ తనకు ఇండస్ట్రీలో రజనీ అంటే ఎంతో ఇష్టం.
వీరిద్దరూ కలిసి అహ నా పెళ్లంట,గుండమ్మగారి కృష్ణులు, భామా కలాపం, జీవన గంగ, చిక్కడు దొరకడు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
ఇలా రాజేంద్రప్రసాద్ రజిని ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వీరిద్దరూ సినిమా సెట్లో ఎంతో చనువుగా కూర్చుని మాట్లాడుతూ ఉండటం వల్ల అది చూసిన వారు వీరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
వాస్తవానికి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ ఉండేది ఈ క్రమంలోనే రజిని నువ్వేం తింటున్నావ్? నువ్వు అంత తెల్లగా ఉండడానికి కారణం ఏమిటి అని ప్రతి చిన్న విషయాన్ని కూపీ లాగేవారు.రాజేంద్రప్రసాద్ డిటెక్టివ్ డ్రెస్ వేసు కోరంతే కానీ…ఆయన ఒక డిటెక్టివ్ అంటూ రజనీ రాజేంద్రప్రసాద్ గురించి తెలిపారు.

ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారికి మా అమ్మగారికి ఎంతో చనువుండేది.ఈ క్రమంలోనే అమ్మ చేసే ప్రతి ఒక్క వంట రాజేంద్ర ప్రసాద్ గారికి నచ్చుతుందని ఇంటర్వ్యూ సందర్భంగా రజిని తెలియజేశారు.అసలు వీరిద్దరి మధ్య ఇంత చనువు ఉండటానికి కారణం ఏంటనే విషయానికి వస్తే… రజిని రాజేంద్రప్రసాద్ సినిమాలో నటించడానికి అంటే ముందుగా అర్జున్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాంటి హీరోయిన్ రాజేంద్రప్రసాద్ సరసన నటించడానికి అడగడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకు చిన్నా.
పెద్దా అని తేడా లేదని.ఒకప్పుడు నేను కూడా ఇండస్ట్రీకి కొత్త దానిని.
నేను కూడా కెరియర్ మొదట్లో చాలా చిన్న దానిని అంటూ రాజేంద్రప్రసాద్ సరసన నటించడానికి ఆమె ఒప్పుకొని ఆయన సినిమాలలో నటించడం వల్ల ఆయనకు మా కుటుంబం పై ప్రత్యేకమైన అభిమానం అంటూ రజిని ఓ సందర్భంలో తెలియజేశారు.