సినిమా పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులలో సైమా అవార్డ్స్ ఒకటి. SIIMA సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కి ఎంతో ప్రత్యేకత ఉంది.
ఈ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ తారలందరూ ఒకే వేదిక పైకి వచ్చి ఎంతో సందడి చేస్తుంటారు.అలాంటి ఎంతో అపురూపమైన సంతోషకరమైన ఈ వేడుకను 2019, 20 సంవత్సరంలో కరోనా కారణం చేత ఈ అవార్డుల ప్రధానోత్సవం వాయిదా పడుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సైమా అవార్డ్స్ ఈ వేడుకను ఈ ఏడాది హైదరాబాద్లో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు.
ఈ క్రమంలోనే 2019 సంవత్సరంలో సైమా అవార్డ్స్ పొందినటువంటి వారు ఎవరు అనే విషయానికి వస్తే.2019 సైమా అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి మహర్షి సినిమాకి గాను ఈ అవార్డు సొంతం చేసుకోబోతున్నారు.అలాగే ఉత్తమ నటుడిగా మహేష్ బాబు(మహర్షి), ఉత్తమ నటిగా సమంత (ఓ బేబీ)విజేతలుగా నిలిచారు.
ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగానికి వస్తే నాని(జెర్సీ) ఈ అవార్డును అందుకోబోతున్నారు అలాగే ఉత్తమ క్రిటిక్స్ నటిగా రష్మిక మందన్నా(డియర్ కామ్రేడ్) ఈ అవార్డును అందుకోనున్నారు.ఉత్తమ సహాయ నటుడు అల్లరినరేష్ (మహర్షి), సహాయనటి లక్ష్మి(ఓ బేబీ) విజేతలుగా ఎంపికయ్యారు.

సైమా అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ చిత్రం అవార్డు విషయానికి వస్తే జెర్సీ(సితార ఎంటర్ టైన్ మెంట్స్) చిత్రం ఉండగా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎఫ్2(శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ఉన్నాయి.ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్(మహర్షి) చిత్రానికి ఎంపిక కాగా, ఉత్తమ గేయ రచయితగా శ్రీమణి(ఇదే కదా.మహర్షి) ఎంపికయ్యారు.ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి(ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్), ఉత్తమ గాయనిగా చిన్మయి శ్రీపాద(మజిలీ ప్రియతమా), ఉత్తమ విలన్, గమ్ము కొండ విజేతలుగా ఎంపికయ్యారు.
ఇక బెస్ట్ డెబ్యూ హీరోగా శ్రీ సింహ(మత్తు వదలరా స్వామి), డబ్ల్యు హీరోయిన్ గా శివాత్మిక రాజశేఖర్(దొరసాని) ఎంపికయ్యారు.ది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా స్వరూప్ ఆర్ ఎన్ జే.(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ) ది బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ స్టూడియో 99(మల్లేశం), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సాను వర్గీస్, (జెర్సీ) ఉత్తమ కమెడియన్ అజయ్ ఘోష్(రాజుగారి గది 3).