బీహార్ రాష్ట్రంలో వరుసగా ప్రజల ఖాతాల్లో వేలాది కోట్లు క్రెడిట్ అవ్వడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.మొన్నటికి మొన్న స్కూల్ కు వెళ్లే ఇద్దరి పిల్లల ఖాతాలో 960 కోట్ల నగదు జమ అయ్యాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అసలు స్కూల్ కు వెళ్లే పిల్లల ఖాతాలో అంత డబ్బు ఎలా క్రెడిట్ అవుతుంది అనే విషయంపై ఉన్నత అధికారులు విచారణ జరుపుతుండగానే మరొక వార్త వచ్చింది.
ఒక రైతు ఖాతాలో 52 కోట్లు క్రిడిట్ అయ్యాయనే విషయం మరొక్కసారి షాక్ కు గురి చెస్తుంది.
అది కూడా బీహార్ రాష్ట్రంలోనే కావడంతో అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు.ఆ రైతు తన నెలవారీ ఫించన్ కోసమని ఖాతా ఓపెన్ చేసాడు.
అయితే అందులోనే 52 కోట్ల డబ్బు జమ అయినట్టు తెలియడంతో ఆ రైతు కూడా షాక్ అయ్యాడు.
బీహార్ లోని ఓ గ్రామానికి చెందిన రామ్ బహదూర్ షా అనే రైతు ఖాతాలో 52 కోట్లు జమ అయ్యాయి.

అతడి ఫించను కోసం ఆ ఖాతాను ఓపెన్ చేసాడు.తన ఫించన్ డబ్బులను చెక్ చేయడం కోసం సర్వీస్ పాయింట్ కు వెళ్లగా అక్కడ అతడి ఖాతాలో 52 కోట్లు గుర్తించి అక్కడ ఆపరేటర్ షాక్ అయ్యాడు/ ఇదే విషయాన్ని ఆ రైతుకు చెప్పగా అతడు కూడా ఆశ్చర్య పోయాడు.

ఈ విషయం క్షణాల్లోనే అందరికి తెలిసి అతడి వద్దకు అందరు వచ్చారు.ఈ విషయం మీడియా ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు.ఈ విషయం అధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ళు కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపాడు.ఇక రామ్ బహుదూర్ మాట్లాడుతూ మాది వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నామని న అకౌంట్ లో పడిన కొంత డబ్బును ఇప్పంచామని కోరుతున్నాడు.