సుకుమార్ భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప, అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.పుష్ప పార్ట్ 1 ది రైజ్ డిసెంబర్ 25 క్రిస్ మస్ రేసులో నిలుస్తుంది.
మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుందని తెలుస్తుంది.అయితే కొంతభాగం మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో షూట్ చేయాల్సి ఉందట.
సెప్టెంబర్ 2 నుండి ఈ నెల చివరి వరకు ఆ షెడ్యూల్ షూటింగ్ ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ షెడ్యూల్ తో మొదటి పార్ట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది.
పుష్ప సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు.సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
సునీల్ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పుకుంటున్నారు.
మొత్తానికి మారేడుమిల్లిలో పుష్ప టీం మరోసారి హంగామా చేస్తుందని తెలుస్తుంది.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన మరో రేంజ్ లో ఉంటుందని చెప్పుకుంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నేషనల్ వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.