అది నాకు చేతకాదు.. కలర్ ఫోటో హీరో షాకింగ్ కామెంట్స్!

కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుహాన్ ఒకరు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన సుహాన్ తన అద్భుతమైన నటన ద్వారా కలర్ ఫోటో సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు.

 Actor And Hero Suhas About Writer Padma Bhushanpadma Bhushan, Tolluywood, Colour-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.తాజాగా సుహాన్ నేడు (ఆగస్టు 19) పుట్టినరోజు కావడంతో తాను నటించబోతున్న రైటర్ పద్మభూషణ్ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను తెలియజేశారు.

మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తనకు హీరోగా అవకాశాలు వచ్చాయని, ప్రస్తుతం మంచి పాత్రలో చేస్తూ ఆరు సినిమాలలో చేస్తున్నానని, ఈ సందర్భంగా తెలియజేశారు.ప్రస్తుతం సుహాన్ తీస్తున్న సినిమాలన్నీ కూడా షార్ట్ ఫిలిమ్స్ తీసే సమయంలో పరిచయమున్న దర్శకులతో చేస్తున్నట్లు తెలిపారు.

ఈ విధంగా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసే సమయంలో మంచి కథలు రావాలని భావించాను.ఈ క్రమంలోనే కలర్ ఫోటో ద్వారా వెండితెరపై హీరోగా నటించే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Padma Bhushan, Tolluywood, Tollywood-Movie

రైటర్ పద్మభూషణ్ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, వారి ఇంటిలో ఏం జరుగుతుంది అనే కథాంశం ద్వారా తెరకెక్కిందని తెలిపారు.ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అద్భుతంగా ఉందని, ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలిపారు.భవిష్యత్తులో ఇంకా మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను కానీ డైరెక్టర్ అవ్వాలని మాత్రం తనకు లేదని చెప్పారు.డైరెక్షన్ చేయడం తనకు చేత కాదని డైరెక్షన్ చేయాలంటే అధిక ఒత్తిడి భరించాల్సి ఉంటుందని అది తనకు చేతకాదని, ఈ సందర్భంగా సుహాన్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube