టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని షాకింగ్ కామెంట్స్!

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “టక్ జగదీష్“.ఈ సినిమా కరోనా రెండవ దశ కంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమాను ఓటీటీలో కాకుండా, థియేటర్ లోనే విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.

 Hero Nani Tuck Jagadish Shocking Comments On Ott Release, Tollywood, Tuck Jagad-TeluguStop.com

అయితే ప్రస్తుతం థియేటర్లు తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా థియేటర్ లో నే విడుదల చేయాలని మొదటినుంచి నాని భావించారు.

ఎందుకంటే తనకు సినిమాను థియేటర్లోనే చూడటం ఇష్టమని తన సినిమా థియేటర్ లోనే విడుదల కావాలని ఓటీటీలో విడుదలవడం తనకు ఇష్టంలేదని గతంలో ఎన్నో సార్లు చెప్పారు.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుడడంతో నాని ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం థియేటర్లు తెచ్చుకున్నప్పటికీ ప్రజలు వస్తారా లేదా అన్న అనుమానం ఉంది.అయితే ఈ సినిమా కోసం నిర్మాతలు ఎక్కువ ఖర్చు చేయడంతో, ఈ సినిమా థియేటర్ లో విడుదల చేయటం వల్ల వారిపై మరింత భారం పడే అవకాశం ఉండటంవల్ల ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు మొగ్గుచూపుతున్నారని ఈ విషయంలో నా నిర్ణయం వారికే వదిలేస్తున్నా.

అంటూ నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Nani, Nani Fans, Ott, Tollywood, Tuck Jagadish-Movie

అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదలైన,ఓటీటీలో విడుదలైనా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నాని తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో 37 కోట్లకు మేకర్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.సాటిలైట్స్, డబ్బింగ్ రైట్స్,ఆడియో రైట్స్ అన్ని కలిపి సుమారు 52 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube