పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ హీరోయిన్!

బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ గత కొద్ది రోజుల క్రితం తల్లి కాబోతున్నానంటూ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ నటి సోమవారం ఉదయం ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

 Chaitra Rai, Bless Baby Girl, Serial Actress, Social Media-TeluguStop.com

చైత్ర రాయ్ తనకు ఆడబిడ్డ పుట్టిందన్న సంగతి తెలిపినప్పటికీ, ఆ చిన్నారి ఫోటోలను మాత్రం అభిమానులతో పంచుకోలేదు. ‘ఇట్స్‌ ఏ బేబీ గర్ల్‌.ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి అనుభూతిని పొందలేదని, చిన్నారి రాకతో తన కుటుంబ సభ్యులు అందరూ ఆనందంలో మునిగిపోయారని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Telugu Bless Baby, Chaitra Rai, Serial Actress-Movie

ఈ విధంగా తనకు బిడ్డ పుట్టిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అందుకు ఇతర నటీనటుల అయినటువంటి యాంకర్ విష్ణు ప్రియ, సుష్మ, మంజు వంటి వారు ఈమెకు శుభాకాంక్షలను తెలియజేశారు.చైత్ర రాయ్ కన్నడనటి అయినప్పటికీ, తెలుగులో పలు సీరియల్స్ లో నటిస్తూ, అచ్చు తెలుగు అమ్మాయిగా ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.అయితే తను తల్లి కాబోతున్న కారణంగా గత కొద్దిరోజుల నుంచి బుల్లితెరకు దూరంగా ఉంటున్న ఈమె గత కొద్ది రోజుల క్రితం ఈ విషయాన్ని తెలియజేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

తాజాగా తనకు ఆడబిడ్డ పుట్టిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube