జీవితం ఒక మిస్టరీ.. పూరీజగన్నాధ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు సినీ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.ఈయన గురించి, ఈయన దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు.ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు పూరి.

 Life Is A Mystery Purijagannadh Interesting Comments Tollywood, Purijagannadh,-TeluguStop.com

ఇక పూరి గత కొన్ని రోజుల నుండి పూరి మ్యూజింగ్స్ అనే పేరు మీద కొన్ని విషయాలు పంచుకుంటున్నాడు పూరి జగన్నాథ్.ఇప్పటికే ఎన్నో విషయాలను పంచుకున్న పూరి తాజాగా జీవితం అనే కాన్సెప్ట్ గురించి వివరించాడు.

జీవితం అనేది ఓ మిస్టరీ అని జీవితం గురించి పరిశోధన చేయడం టైం వేస్ట్ పని అన్నాడు.ప్రతి ఒక్కరూ జీవితం గురించి, జీవితంలో ఉన్న అర్థం ఏమిటి అనే వాటికి సమాధానాల కోసం బాగా పరిశోధనలు చేస్తున్నారని తెలిపాడు.

Telugu Purijagannadh, Mystery, Liger, Purijagandh, Tollywood-Movie

ఇక వీటి గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు పూరి.వేల సంవత్సరాల నుండి గురువులు, బాబాలు మన చుట్టూ ఉండే వారని వాళ్లను ఎన్నో ప్రశ్నలు అడిగే వాళ్ళమని తెలిపాడు.కర్మఫలాన్ని నిర్ణయించేది.అసలు మనిషికి పునర్జన్మ ఉందా లేదా అని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటామని.కానీ వాళ్లు ఇచ్చే సమాధానాలు రకరకాలుగా ఉంటాయి అని తెలిపాడు పూరి.

Telugu Purijagannadh, Mystery, Liger, Purijagandh, Tollywood-Movie

అందుకు మనం వేసే ప్రశ్నలతో వాళ్లని విసిగించడం తప్ప వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలిపాడు.అందుకే ఆ ప్రశ్నలను వాళ్లు తట్టుకోలేక మనందరినీ ఆశ్రమంలో చేర్చుకుంటారు ఆ తర్వాత యోగాలు, ధ్యానాలు వంటివి నేర్పిస్తుంటారు అని తెలిపాడు.అలా ధ్యానాలు చేయడం వల్ల ఆలోచించే శక్తి పెరుగుతుందని పిచ్చి ప్రశ్నలు రావని అందుకే సైలెంట్ గా ఉండిపోతామని తెలిపాడు.

అందుకే లైఫ్ అనేది మిస్టరీ అని దాన్ని పరిశోధించడం అనేది టైం వేస్ట్ అనిఅందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని తెలిపాడు పూరిజగన్నాధ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube