చంద్రబాబు నాయుడు అంటే ఒకప్పుడు మహా మేథావి అనే పేరు సంపాదించుకున్నారు.రాజకీయాల్లో చక్రం తిప్పడంతో ఆయన చాణక్యుడు అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు.
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సొంత రాష్ట్రంలో కూడా పట్టు కోల్పోతున్నారు.క్రమంగా జగన్ సేన ఆయన్ను పచ్చ మీడియా, పచ్చ సైన్యం అనే ముద్ర పడేలా చేస్తోంది.
అయితే చంద్రబాబు విమర్శలకు ధీటుగానే సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా కూడా ఆయన వెంట ఉండు కార్యకర్తలు మాత్రం ఇలా లేరనే చెప్పాలి.
చంద్రబాబును తిట్టేవారు సహజంగానే ఆయన మాట్లాడితే తప్పు పట్టే వారిని కూడా అప్పుడుప్పుడు చంద్రబాబు తన పనులతో తన దారిలోకి తెచ్చుకుంటారనేది అందరికీ తెలిసిందే.
ఇక ఇప్పుడు కూడా చంద్రబాబు ఇదే విధంగా తన పనులతో మరోసారి తనను తీవ్రంగా వ్యతిరేకించే వారిని సైతం మెచ్చుకునేలా చేశాడనే చెప్పక తప్పదేమో.ఇక ఇప్పుడు ఆయన వీరాభిమాని అయిన బొప్పన రాఘవేంద్ర రావు కృష్ణా జిల్లా లో నివాసం ఉంటున్నారు.
కాగా ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో బాధ పడుతూ ఉన్నారు.

ఇక ఆయన చివరి కోరికగా చంద్రబాబును చూడాలని చెప్పడంతో ఇక ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధిపతి అదే సమయంలో అర్జెంట్ పనిమీద హైదరాబాద్ కు రెడీ అవుతున్నారు.కాగా అది ఎంత అర్జెంట్ పని అయినా సరే వెంటనే క్యాన్సిల్ చేసుకుని మరీ తన కాన్వాయ్ ను నేరుగా రాఘవేంద్రరావు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆసుపత్రికి పోనిచ్చారు.ఇక తీన అభిమాని రాఘవేంద్రరావును కలిసి ఆయనకు అందాల్సిన ట్రీట్ మెంట్‌పై డాక్టర్లకు కూడా సూచనలు జారీ చేవారు.ఇక చంద్రబాబు చేసిన ఈ పనితో ఆయన్ను వ్యతిరేకించే వారు కూడా ఆయన్ను మెచ్చుకుంటున్నారు.