సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన శాకుంతలం( Shaakuntalam ) సినిమా ప్రమోషన్స్ లో వేగం పెరిగింది.మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
తాజాగా శాకుంతలం సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ రిలీజైంది.అత్యద్భుతమైన డైలాగ్స్ తో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
94 సెకన్ల నిడివితో ఈ ట్రైలర్ రిలీజ్ కాగా శకుంతల పాత్ర సామ్( Samantha ) నటించలేదని జీవించిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.“నీ కష్టాలకు కన్నీళ్లు పెట్టగలం కానీ నీ కర్మను పంచుకోలేం” అనే డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.దేవ్ మోహన్( Dev Mohan ) సైతం యుద్ధ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దేవ్ మోహన్ టాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.
అల్లు అర్హ( Allu Arha ) ఈ సినిమాలో భరతుని పాత్రను పోషించగా సినిమాలోని క్లైమాక్స్ అంతా అర్హ పాత్రపై నడుస్తుందని అర్హ తెలుగులో చెప్పే డైలాగ్స్ చాలా క్యూట్ గా ఉంటాయని సమాచారం అందుతోంది.ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని సమాచారం.త్రీడీలో కూడా ఈ సినిమా రిలీజవుతున్న నేపథ్యంలో త్రీడీ ప్రేక్షకులను ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.
దిల్ రాజు కూడా ఈ సినిమాకు నిర్మాత కావడంతో రికార్డ్ స్థాయి థియేటర్లలో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలవుతోంది.సమంత అభిమానులను ఈ సినిమా కచ్చితంగా మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా శాకుంతలం నిలుస్తుందని ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకుని వెళ్లినా ఈ సినిమా మెప్పించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోహన్ బాబు( Mohan Babu ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం గమనార్హం.