తెలంగాణలో తగ్గిన కరోనా ఉధృతి..!

తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గింది.మొన్నటి వరకు 2 వేలకు పైగా నమోదైన కేసులు నిన్నటి నుంచి వెయ్యికి పైగా నమోదవుతున్నాయి.

అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అజాగ్రత్తగా ఉంటే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు.బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ సూచించింది.

తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,378 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్సటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,87,211కి చేరింది.1,932 మంది కరోనా బారిన పడి కోలుకుని నిన్న డిశ్చార్జ్ అవ్వగా.దీంతో ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,56,431కి చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,107 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం రాష్ట్రంలో 29,673 యాక్టివ్ కేసులున్నాయని, వీరిలో 24,054 మంది హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 35,465 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.ఇప్పటివరకూ 28,86,334 కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.కాగా, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 83.55 శాతంగా ఉందని, మరణాల శాతం 0.59 శాతంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.జిల్లాల వారీగా నమోదైన కరోనా కొత్త కేసుల వివరాలు.

హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 254, రంగారెడ్డిలో 110, మేడ్చల్ మల్కాజిగిరిలో 73, భద్రాద్రి కొత్తగూడెంలో 49, జగిత్యాలలో 39, కరీంనగర్ లో 78, మహబూబాబాద్ లో 47, నల్గొండలో 53, నిజామాబాద్ లో 55 కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు