లక్షల్లో ఫ్లైట్ టికెట్ ధరలు ... స్పందించిన డీజీసీఏ, అంతర్జాతీయ ప్రయాణీకులకు కీలక సూచనలు

భారత్‌లో కరోనా రెండో దశ కారణంగా అనేక దేశాలుశం నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆయా దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఏప్రిల్‌తో మొదలైన ఈ ట్రావెల్ బ్యాన్ మనదేశంపై ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.

 Dgca Advises Passengers Travelling To International Destinations To Check Fare O-TeluguStop.com

అయితే భారత్‌లో కోవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో ఒక్కొక్క దేశం నిషేధాన్ని ఎత్తివేస్తూ వస్తున్నాయి.అమెరికా, బ్రిటన్, యూఏఈలు నిషేధాన్ని ఎత్తివేసిన జాబితాలో వున్నాయి.

దీంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే ఇదే అదనుగా పలు ఎయిర్‌లైన్స్‌లు టికెట్ల ధరలను భారీగా పెంచేస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ మేరకు గురువారం (ఆగస్టు 5) నుంచి ప్రవాసులు యూఏఈకి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

ఇక ఈ ప్రకటన రావడంతో ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు.ఇన్నాళ్ల తమ ఎదురుచూపులు ఫలించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.దీంతో యూఏఈ తిరిగి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎగబడ్డారు.అయితే ఇదే అదనుగా ప్రయాణీకుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి విమానయాన సంస్థలు.

ఎలాంటి మొహమాటం లేకుండా టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి.ప్రస్తుతం విమాన టికెట్ ధరలు సాధారణ రోజుల్లో కంటే 300 రేట్లు అధికంగా ఉన్నట్లు సమాచారం.

గతంలో ఢిల్లీ-దుబాయ్ వన్‌వే టికెట్ ధర 750-900 దిర్హమ్స్ (ఎకనామీ క్లాస్) ఉండేది.కానీ, ప్రస్తుతం అది 2 వేల దిర్హమ్స్‌కు చేరుకుంది.

ఇదే విధంగా మిగతా తరగతి టికెట్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

అటు బ్రిటన్ కూడా భారత్‌పై ఆంక్షలను ఎత్తివేసింది.

ప్రస్తుతం ఇండియాలో పరిస్థితులు కాస్త మెరుగుపడినందున రెడ్‌లిస్ట్ నుంచి తొలగించి, అంబర్ లిస్ట్‌లో చేర్చింది.ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా హోటల్ క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

ఆంక్షల ఎత్తివేత నేపథ్యంలో ఇండియా- యూకే విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి.వన్ వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు అక్షరాల రూ.4 లక్షలకు చేరుకున్నాయి.దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారి సంజీవ్ గుప్తా ట్విట్టర్ ద్వారా కేంద్ర పౌర విమానయాన శాఖకు ఫిర్యాదు చేశారు.ఆగస్టు 26న ఢిల్లీ నుంచి లండన్‌కు విమాన టికెట్ ధర రూ.3.95 లక్షలన్న ఆయన.ఇది ఫస్ట్ క్లాస్ కాదని, బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర అని చెప్పారు.ఇదే సమయంలో ఎయిరిండియా, విస్తారాలు కూడా ఎకానమి క్లాస్‌కు రూ.1.2 నుంచి 2.3 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాయని గుప్తా ట్వీట్ చేశారు.

Telugu Delhidubai, Dgcaadvises, Indians, Economy Class-Telugu NRI

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలకు సంబంధించి డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్స్‌) రంగంలోకి దిగింది.మెటా సెర్చ్‌ ఇంజిన్లలో వాస్తవమైన ధరలు ఉండకపోవచ్చని, ఈ మేరకు టికెట్ల ధరలను నేరుగా విమానయాన వెబ్‌సైట్లలోనే చూసుకోవాలని ప్రయాణికులకు సూచించింది.అయితే గూగుల్‌ వంటి మెటా సెర్చ్‌ ఇంజిన్లలో ఒక్కోసారి ఎయిర్‌లైన్‌ వెబ్‌సైట్లలో ఉండే ధరల కంటే ఎక్కువ ధరలు చూపిస్తున్నాయని, దీంతో గందరగోళ సమస్యలు తలెత్తుతున్నాయని డీజీసీఏ అధికారులు చెబుతున్నారు.మరోవైపు టికెట్‌ ధరలకు సంబంధించి విమానయాన సంస్థలకు కూడా డీజీసీఏ పలు ఆదేశాలు జారీ చేసింది.

మెటా సెర్చ్‌ ఇంజిన్లలో విమాన టికెట్‌ ధరలు ఎయిర్‌లైన్‌ వెబ్‌సైట్లలో కంటే ఎక్కువ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube