తండ్రిని రెండు కోరికలు కోరిన బండ్ల గణేష్ కూతురు.. అవేంటంటే?

ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా….ఆ కార్యక్రమంలో బండ్ల గణేష్ ఉన్నాడంటే ఆ కార్యక్రమానికి వచ్చే కిక్కే వేరు అని చెప్పవచ్చు.

 Bandla Ganesh And His Daughter Janani In Omkar Sixth Sense, Bandla Ganesh , Daug-TeluguStop.com

కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.ఇక బండ్లన్న ఏ కార్యక్రమానికి వెళ్లినా… ఆ కార్యక్రమంలో తప్పకుండా తను దేవుడిగా భావించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భజన మాత్రం ఆపరు.

మొన్నామధ్య ఈశ్వరా…పరమేశ్వరా… పవనేశ్వరా అంటూ తనదైన శైలిలో సందడి చేశారు.తాజాగా బండ్ల గణేష్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సిక్స్త్ సెన్స్ సీజన్ 4 ప్రతి శని ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమానికి ఓంకార్ బండ్లగణేష్ ను ఆహ్వానించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన బండ్ల గణేష్ తనతోపాటు తన కూతురు జననిని తీసుకువచ్చి మొట్ట మొదటిసారిగా ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన బండ్ల గణేష్ ఎప్పటి మాదిరిగానే ఈ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ భజన చేశారు.అదేవిధంగా తన 18 సంవత్సరాల కూతురు జననిని పరిచయం చేస్తూ ఈ విధంగా మాట్లాడారు….నా కూతురు ఈ 18 సంవత్సరాలలో నన్ను కేవలం రెండే రెండు కోరికలు కోరింది అంటూ తన కూతురు కోర్కెలను బయటపెట్టారు.నాన్న.పవన్ కళ్యాణ్ గారితో మళ్లీ బ్లాక్ బస్టర్ సినిమా ఎప్పుడు తీస్తావు….ఓంకార్ అన్నయ్య షో కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళు అనే రెండు కోరికలు కోరింది.

అందుకే తనతో పాటు ఈ షో కి తీసుకు వచ్చానని అదీ నీకు ఉన్న క్రెడిబిలిటీ అంటూ ఓంకార్ పై ప్రశంసల వర్షం కురిపించారు.మొత్తానికి మన బండ్లన్న ఎక్కడ ఉన్న ఏం చేస్తున్న అది మాత్రం సంచలనం సృష్టిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం.మొత్తానికి సిక్స్త్ సెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న బండ్లగణేష్ ఈ కార్యక్రమంలో కూడా తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube