కరోనా టైం లో విద్యావ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి.ఒక అకడమిక్ ఇయర్ మొత్తం ఆన్ లైన్ టీచింగ్ ద్వారానే నడిపించారు.
అయితే ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆన్ లైన్ టీచింగ్ అవసరం కరోనా గుర్తు చేసిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వృత్తి విద్యా కోర్సులకు ఆన్ లైన్ టీచింగ్ అందుబాటులో ఉంటుందని అన్నారు.నూతన విద్యా ధానంపై మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడారు.
ఇకపై ఆన్ లైన్ టీచింగ్ పై కూడా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ఆన్ లైన్ క్లాసులను స్టూడెంట్స్ ఎంతవరకు గ్రహిస్తున్నారు అన్న విషయం మీద కూడా కసరత్తు చేయాలని అన్నారు.
ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై ఇప్పటికే ఒక సర్వే నిర్వహించామని అన్నారు.
ఇప్పటికే అమ్మ ఒడి కార్యక్ర్మంలో భాగంగా 10 లక్షల ల్యాప్ టాప్స్ కావాలని ముఖ్యమంత్రికి చెప్పామని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు.రాష్ట్రంలో 0.2 శాతం కంటే తక్కువ మందికి ల్యాప్ ట్యాప్స్ ఉన్నాయి.25 శాతం మంది విద్యార్ధులకు టీవీ కూడ అందుబాటులో లేదని అన్నారు.మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. స్కూల్స్ ఎక్కువ దూరం ఉంటే డ్రాప్ అవుట్స్ ఉండే అవకాశం ఉంటుందనిఅలాంటి పరిస్థితి లేకుండా 1 నుండి 1.5 కిలో మీటర్ల మించి దూరం లేకుండా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.