పాలు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.అందుకే ఎక్కుగా పాలు తాగమని చెప్తారు డాక్టర్లు.
చిన్న పిల్లలకు కూడా పాలు పట్టాలని చెబుతారు.ఇక ఈ కరోనా వచ్చాక పాలు ఎక్కువగా తాగుతున్నారు ప్రజలు.
ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్కోసం .ఇక పసుపు వేసిన పాలను తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం.
పాలల్లో సాధారణంగా శరీరానికి కావాల్సిన అనేక పోషకాలుంటాయి.
అయితే ఆ పాలల్లో కొంచెం పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని పలు సర్వేలు చెబుతున్నాయి.అయితే ప్రస్తుత కరోనా కాలంలో పసుపు పాలు చాలా అవసరం.
ఈ పసుపు వేసిన పాలు తాగి ఇమ్యూనిటీని పెంచుకోవాలని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు.

పసుపు కలిపిన పాలల్లో యాంటీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి.ఆయుర్వేదం ప్రకారం పసుపు కలిపిన పాలను సూపర్ మిల్క్అని పిలుస్తారు.అంటే ఇవి అంత పవర్ఫుల్ అన్నమాట ఇలాంటి పాలను రాత్రివేళ పడుకునే ముందు తాగితే మంచిగా నిద్ర పడుతుంది దగ్గు, జలుబును త్వరగా తగ్గిస్తాయి.

ఒత్తిడిని తగ్గించి, ప్రతిరోజూ మంచి నిద్ర పడుతుంది.పసుపు పాలతో రోగనిరోధక శక్తి పెరుగుతోంది.పసుపు పాలతో మలబద్దకం.అజీర్తి సమస్యలు దరిచేరవు.జీర్ణక్రియ ప్రక్రియ కూడా బాగుపడుతుంది.దీంతోపాటు ఉదర సమస్యలు రావు.
ప్రతి రోజూ నిద్రపోయే ముందు గ్లాసు పసుపుపాలు తాగితే ఎన్నో రకాల సమస్యలు దూరమవుతాయి.అందుకే ఈ కరోనా ఉన్నన్ని రోజులు ఒక గ్లాసు పసుపు పాలు తాగండి.
ఆరోగ్యంగా ఉండండి అని డాక్టర్లు చెబుతున్నారు.ఇప్పటి వరకు కరోనా ఉన్న పేషెంట్లు కూడా వీటిని తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.
అలాగే నిద్రలేమి, ఒత్తిడి ఉన్న వారు రోజూ ఒక గ్లాసు పాలు తాగితే చాలా రకాల సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారు.