దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.కరోనాకు మందు లేకపోవడంతో లక్షణాలను బట్టి చికిత్సను అందిస్తున్నారు.
అయితే నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ఆనందయ్య మందును తీసుకున్న వాళ్లలో ఎక్కువమంది ఆ మందు విషయంలో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.
అలా ఆనందయ్య మందు గురించి పాజిటివ్ గా చెప్పిన వాళ్లలో హెడ్ మాస్టర్ కోటయ్య కూడా ఒకరు.అయితే ఆనందయ్య మందును తీసుకున్న కోటయ్య మృతి చెందడంతో ఆనందయ్య మందుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఆనందయ్య మందుకు సంబంధించిన నివేదిక నేడు వెలువడనుంది.ఆ నివేదికను బట్టి ఆనందయ్య మందు పంపిణీ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఆనందయ్య మందు తీసుకున్న తరువాత కోలుకున్నానని చెప్పిన కోటయ్య తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు.అయితే ఆస్పత్రిలో చికిత్సకు కోలుకోలేక ఆయన మృతి చెందడం గమనార్హం.కోటయ్య మరణం ఆనందయ్య మందు తీసుకున్న వాళ్లను సైతం తెగ టెన్షన్ పెడుతుండటం గమనార్హం.ఆనందయ్య మందు పూర్తిస్థాయిలో కరోనాను నయం చేయలేదా.? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నివేదిక వెలువడితే మాత్రమే ఆనందయ్య మందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే ఎక్కువమంది ప్రజలు మాత్రం ఆనందయ్య మందు పంపిణీ మళ్లీ మొదలైతే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ఇదే సమయంలో కృష్ణపట్నంలో సైతం కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటికే ఇద్దరికి కరోనా నిర్ధారణ కాగా మరి కొందరిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.అయితే ఆనందయ్య మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావని ఆ మందుపై పరిశోధనలు చేసిన వాళ్లు చెబుతుండటం గమనార్హం.