రామ్ చాలా కలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు.డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా సినిమా సూపర్ హిట్ అయ్యింది.
అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ తో ఉన్న రామ్ ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ హీరోగా మారిపోయాడు.ఒకే సినిమాతో.
హీరో రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చార్మీకి కూడా లక్ కలిసి వచ్చింది.ఈ సినిమా రామ్ మూవీ కెరీర్‌లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు.

మొదట్లో మిక్సడ్ టాక్‌ను అందుకున్న ఈ చిత్రం క్రమంగా హిట్‌ను అందుకుంది.ఇప్పుడు ఈ సినిమా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది.తెలుగు సినిమాలు యూట్యూబ్ లో హిందీలో డబ్ అవుతూ ఉంటాయి.
ఈ సినిమాలను బాలీవుడ్ జనాలు బాగానే ఆస్వాదిస్తూ ఉంటారు.ఇప్పటికే చాలా సినిమాలు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ ను దక్కించుకున్నాయి.
క్రేజీ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండటంతో మంచి వ్యూస్ ను దక్కించుకుంటుంది.
200 మిలియన్ ఈ సినిమా పూర్తి చేసుకుంది.తక్కువ సమయంలోనే 20 కోట్ల వ్యూస్ ను ఈ సినిమా దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి.
ఇక రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.రామ్ నటించిన జగడం, హలో గురూ ప్రేమ కోసమే, నేను శైలజ కూడా 300 మిలియన్ వ్యూస్ ను ఎప్పుడో దాటేశాయి.నిజానికి ఇవి తెలుగులో పెద్దగా హిట్ అయిన సినిమాలు కాదు.కానీ హిందీ డబ్బింగ్ వెర్షన్ లో అదరగొట్టేస్తున్నాయి.దీంతో హిందీ ఆడియన్స్ లో రామ్ కి క్రేజ్ వచ్చింది.ఇదే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కు కలిసొచ్చింది.