1.రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి నగదు రహిత చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీనిని త్వరలోనే అమలులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాల్లో ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
2.తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్
వైయస్సార్ ‘తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ‘ ఈ సేవలో భాగంగా అత్యాధునికమైన 500 ఏసీ వాహనాలను ఏపీ సీఎం జగన్ విజయవాడ లో ప్రారంభించారు.
3.గ్రూప్ వన్ గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి అనుమతి
ఏపీలో గ్రూప్ వన్ గ్రూప్ టు ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ కి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది.
4.దాన్యం కొనుగోలు ఆహారంపై ఈటెల రాజేందర్ కామెంట్స్
వరి ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనకపోతే వెంటనే తప్పుకోవాలని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
5.ఇతర వర్గాలకు దళిత బంధు
రాబోయే రోజుల్లో దళిత బంధు ను ఇతర వర్గాలకు విస్తరిస్తామని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు అన్నారు.
6.టిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్యోగుల అందిపాన్
గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్యోగుల ఆందోళన చోటు చేసుకుంది.సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ , పేషెంట్ కేర్ సర్వీస్ సిబ్బంది ఆందోళనకు దిగారు.
7.వి హిట్ కు ఢిల్లీ పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది.
8.రాజ్ భవన్ వద్ద ఉగాది వేడుకలు
ఈరోజు సాయంత్రం తెలంగాణ రాజ్ భవన్ లో ఉగాది వేడుకలను నిర్వహించనున్నారు.ఈ వేడుకలకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళ సై ఆహ్వానం పంపారు.
9.యాదాద్రి ఆలయ తిరువీధుల్లో రెడ్ కార్పెట్
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు నడిచేందుకు ఆలయ తిరువీధుల తో పాటు, శివాలయం వరకు రెడ్ కార్పెట్ ఏర్పాటు చేశారు.
10.శ్రీశైలం లో తెరుచుకున్న దుకాణాలు
శ్రీశైలంలో షాపులు తెరుచుకున్నాయి.నిన్న అర్ధరాత్రి జరిగిన గొడవతో దుకాణాలను వ్యాపారులు మూసివేశారు.
11.ఒంటిమిట్ట లో టీటీడీ చైర్మన్ పర్యటన
కడప జిల్లాలో ఒంటిమిట్ట కోదండరాముడిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఈరోజు దర్శించుకున్నారు.
12.మరింత పెరగనున్న ఎండలు
రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింతగా పెరుగుతాయని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
13.కొత్త విద్యుత్ చార్జీలపై సోము వీర్రాజు కామెంట్స్
ఏపీ లో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు.విద్యుత్ చార్జీలు పెంచి ప్రభుత్వం ప్రజల నడ్డి విడిచింది అంటూ వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
14.836 వ రోజుకి చేరిన అమరావతి రైతుల దీక్ష
ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి కోరుతూ, ఆ ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్ష నేటికి 836 వ రోజుకు చేరింది.
14.విద్యుత్ చార్జీల పెంపు పై జనసేన నిరసన
చేతిలో విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం ఉత్తర్వులు జారీ చేయడంపై విజయవాడలో జనసేన నాయకులు ఆందోళన కు దిగారు
15.ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు
ఏపీలో ఈనెల 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి .ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉత్తర్వులు జారీ చేశారు.
16.ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీ
ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ రోజు సాయంత్రానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
17.భవిష్యత్తులో జగన్ ప్రధాని అయ్యే అవకాశం
భవిష్యత్తులు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నట్లు మంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
18.విశాఖలో క్యాబ్ డ్రైవర్ లో వినూత్న నిరసన
విశాఖపట్నం లో క్యాబ్ డ్రైవర్లు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు.ఈరోజు ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద క్యాబ్ డ్రైవర్లు కారుకి గొలుసులు కట్టి లాగారు.
19.రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి ఆలయ హుండీ కి రికార్డ్ స్థాయిలో ఆదాయం లభించింది.మార్చి లో 128.61 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడి వెల్లడించింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,100 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,470
.