టాలీవుడ్ లో దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వరుసగా సినిమా లు చేస్తూ వచ్చిన అనుష్క బాహుబలి తర్వాత అనూహ్యంగా సినిమా ల సంఖ్య పెంచాల్సింది పోయి తగ్గించింది.బాహుబలి తర్వాత అనుష్క చేసిన సినిమా లు ఏంటీ అనేది అందరికి తెల్సిందే.
అవి కూడా నిరాశ పర్చాయి.దాంతో అనుష్క అభిమానులు తీవ్ర నిరుత్సాహం లో ఉన్నారు.
నిశబ్దం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఆ వెంటనే సినిమా ను మొదలు పెట్టబోతుందని అంతా భావించారు.కాని ఇప్పటి వరకు అనుష్క కొత్త సినిమా ను కనీసం ప్రకటించలేదు.
అసలు ఈమద్య కాలంలో సినిమా ఉందా లేదా అంటూ అంతా అనుమానంతో ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో అనుష్క నుండి రెండు క్లారిటీలు వచ్చాయి.
ఈ ఏడాదిలో అనుష్క కొత్త సినిమా తో పాటు పెళ్లి విషయమై కూడా క్లారిటీ వస్తుందని అంతా భావించారు.కాని తాజాగా అనుష్క సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాదిలో పెళ్లి మరియు సినిమా రెండు లేవని తేలిపోయింది.
అనుష్క ఇప్పటి వరకు కొత్త సినిమా కు కమిట్ అవ్వలేదు.ఒక వేళ కొత్త సినిమా ను ఒప్పుకున్నా కూడా ఆమె ఈ ఏడాది లో కెమెరా ముందుకు వెళ్లక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
ప్రస్తుతం కరోనా కారణంగా అనుష్క పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది.రాబోయే రోజుల్లో కూడా అనుష్క కొత్త ప్రాజెక్ట్ ల విషయం లో నిర్ణయం తీసుకోదు అంటూ అనుష్క సన్నిహితులు మరియు పీఆర్ టీమ్ చెబుతున్నారు.
అతి త్వరలోనే అనుష్క సినిమా కు సైన్ చేస్తుంది.షూటింగ్ కు హాజరు అవుతుందని భావించిన అభిమాను లకు ఇది నిరాశ కలిగించే విషయం.