వేసవిలో పుచ్చకాయలు ఎక్కవగా దొరుకుతాయి.ఇక పుచ్చకాయలో అనేక పోషకాలు ఉంటాయి.
ఈ పండ్లను తినడం వలన ఆరోగ్యానికి చాల ఆమంచిది.అయితే కేవలం పుచ్చకాయ మాత్రమే కాదు, అందులో ఉండే గింజలు కూడా మనకు ఉపయోగమే.
వాటితో కలిగే లాభాలను గురించి ఒక్కసారి చూద్దామా.
పుచ్చకాయ విత్తనాల్లో అనేక రకాల ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి.
ఈ గింజలలో విటమిన్ బి, థయామిన్, నియాసిన్, ఫోలేట్, పొటాషియం, ఐరన్, జింక్, పాస్ఫరస్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి.వీటి వల్ల మనకు శక్తి కూడా బాగానే లభిస్తుంది.
కేవలం 100 గ్రాముల పుచ్చకాయ విత్తనాలను తీసుకుంటే వాటిలో 600 క్యాలరీల శక్తి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
పుచ్చకాయ విత్తనాల్లో ఫైబర్ కూడా ఎక్కువే.ఇది జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది.
లివర్ వ్యాధులు, వాపులతో బాధపడే వారికి పుచ్చకాయ విత్తనాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి.యాంటీ ఏజింగ్ లక్షణాలు పుచ్చకాయ విత్తనాల్లో ఉన్నాయి.
వయస్సు మీద పడడం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు పోతాయి.బీపీ నియంత్రణలో ఉంటుంది.
రక్త సరఫరా మెరుగు పడుతుంది.గుండె సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది.

అంతేకాదు.పుచ్చకాయ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సంవృద్ధిగా లభిస్తాయి.ఇవి పలు రకాల ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి.ఇక క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.డయాబెటిస్ ఉన్న వారికి పుచ్చకాయ విత్తనాలు మంచిగా పని చేస్తాయి.దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
జ్వరం వంటివి వచ్చినప్పుడు పుచ్చకాయ విత్తనాలను మరిగించి చేసిన నీటిని తాగిస్తే త్వరగా కోలుకుంటారు.పుచ్చకాయ విత్తనాల్లో జ్ఞాపకశక్తి పెంచే ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
పుచ్చకాయ విత్తనాలను నీటిలో మరిగించి తయారు చేసిన మిశ్రమాన్ని తాగితే మెమొరీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది.ఇరాక్ పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.దీంతో సంతానం పొందడానికి అధికంగా చాన్స్ ఉంటుంది.ఒంట్లో నీరు అధికంగా చేరిన వారు పుచ్చకాయ విత్తనాలతో చేసిన నీటిని తాగాలి.
దీంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.