నాగార్జునసాగర్ పై ఆశలు వదులుకున్న బీజేపీ...ఇక గురి అటువైపే?

తెలంగాణలో ఉప ఎన్నికల పర్వానికి తెర పడిందనే చెప్పవచ్చు.దుబ్బాక తరువాత జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రాజకీయంగా రణరంగాన్ని తలపించింది.

అధికార ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకున్న పరిస్థితి ఉంది.అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ లో 40 కి పైగా సీట్ల గెలవడంతో బీజేపీ అత్యంత ఉత్సాహంగా కనిపించింది.

అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచి వెనుకంజలో నిలిచింది.అయితే అప్పటివరకు ఊపు మీదున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో సైలెంట్ అయిందని చెప్పవచ్చు.

అయితే నాగార్జున సాగర్ గెలుపు మీద ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యాడర్ లేదనేది వాస్తవం.అయినా అక్కడ బీజేపీ అభ్యర్థిని బరిలో నిలిపింది.

Advertisement

అయితే నాగార్జున సాగర్ కాంగ్రెస్ నియోజకవర్గం కావడం, టీఆర్ఎస్ గెలిచిన స్థానం కావడంతో బీజేపీకి ఇక్కడ గెలవడానికి అసలు ఏ ఒక్క అవకాశం లేకుండా పోయింది.అయితే ఇక గెలవలేమనే ఆలోచనతో ఇక త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల వైపు బీజేపీ దృష్టి పెట్టింది.

ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ బీజేపీ నాయకులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది.ఇక ఈ ఎన్నికల్లో సత్తా చాటి టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అని తెలియజేయాలనే ఆతృతలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు