బండి సంజయ్ ని ఆ పార్టీ నేతలే లైట్ తీసుకుంటున్నారా?

తెలంగాణలో రెండో దఫా ఎన్నికల కంటే ముందు అసలు రాష్ట్రంలో అసలు బీజేపీ ఊసే లేనటువంటి పరిస్థితి ఉంది.అయితే రెండో దఫా ఎన్నికలు అయిన తరువాత ఒక సంవత్సరం తరువాత బీజేపీ ఏకంగా అధికార టీఆర్ఎస్ ను ఓడించే పరిస్థితి రావడంతో ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోయిన పరిస్థితి ఉంది.

 Are The Party Leaders Taking Bandi Sanjay Lightly, Bandi Sanjay, Ktr, Telangana-TeluguStop.com

అయితే బీజేపీకి రాష్ట్రంలో కొంత బలపడే అవకాశం ఉన్నా కొద్దిగా నాయకత్వ లోపం కారణంగా బలంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయింది.అయితే అప్పటివరకు ఉన్న బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ కాని, కిషన్ రెడ్డి చాలా సౌమ్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది.

అయితే బండి సంజయ్ అధ్యక్షునిగా నియామకం అయిన తరువాత ఒక్కసారిగా బీజేపీ స్థాయి మారపోయిందనే చెప్పవచ్చు.అప్పటి వరకు క్లాస్ లీడర్లుగా పేరుగాంచిన తరుణంలో మాస్ లీడర్ గా బండి సంజయ్ తన పదునైన మాటలతో కార్యకర్తలలోకి బలంగా చొచ్చుకెళ్ళాడు.

ఇక అప్పటి నుండి బీజేపీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు.అయితే బండి సంజయ్ అధ్యక్షునిగా నియామకం అవడం బీజేపీలో కొంత మందికి కంటగింపుగా మారిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే అవి ఉత్తుత్తి ప్రచారం అని బీజేపీ నేతలు కొట్టిపడేసినా కొన్ని కొన్ని ఘటనలతో ఆ ప్రచారం నిజమే అని అనుకునేలా బలం చేకూరుస్తుంది.తాజాగా ఎల్బీ నగర్ నియోజకవర్గం కి సంబంధించి ఓ బీజేపీ కార్పొరేటర్ మృతితో ఆ స్థానం ఖాళీగా ఖాళీ కావడంతో మరల పోటీ లేకుండా కేటీఆర్ ను కలిసి ఏకగ్రీవం కోసం మద్దతివ్వాలని బీజేపీ నాయకులు కోరారు.

అయితే కేటీఆర్ దీనికి అంగీకరించిన విషయం తెలిసిందే.ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ వ్యవహారం అంతా బండి సంజయ్ కు తెలియకుండా జరిగిందని అసలు సంజయ్ కు చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ ఘటనను బట్టి బండి సంజయ్ ను బీజేపీలో ఉన్న మరో వర్గం సైడ్ చేస్తుందనే వాదనలకు ఈ ఘటనతో బలం చేకూరుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube