సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటూ రక్షణ కల్పించాల్సిన పోలీసులే విచక్షణ రహితంగా ప్రవరిస్తున్నారు.ప్రజలకు మంచి చెప్పాల్సిన వాళ్లే రౌడీలా ఒక్కరిని ఒక్కరు కొట్టుకుంటున్నారు.
పోలీసులు సమాజానికి ఆదర్శంగా ఉంటూ మంచి చెడు చెప్పాల్సిందిపోయి వారిలో వారే కొట్టుకుంటున్నారు.ఇక పోలీసులకు ఓర్పు చాలా అవసరం.
వాళ్ళు ఉండే సిట్యూవేషన్ ఎలాంటిది అయినా సహనంతో వ్యవహరించాలి.వాళ్ళకి మంచి చెడు చెబుతూ గైడెన్స్ ఇస్తూ అందరికి ఆదర్శంగా ఉండాలి.
అయితే సమాజంలో నలుగురికి తప్పు ఏదో, ఒప్పు ఏదో చెప్పాల్సిన పోలీసులే దారితప్పితే.వాళ్ళు నవ్వులపాలు కావడం తప్ప మరొకటి ఉండదు.తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలో ఇద్దరు పోలీసులు హద్దులు మీరారు.ఇక నడిరోడ్డుపై ఇద్దరు ఘర్షణకు దిగారు.
అయితే హెల్మెట్ ధరించలేదనే ఆగ్రహంతో ఓ ట్రాఫిక్ పోలీస్.మరో పోలీస్‌పై ఆగ్రహించాడు.
ఇక ఝార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
రాంచీలోని సహజానంద్ చౌక్ దగ్గర్లో ఓ పోలీస్ హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తున్నారు.ఇక పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ అది గమనించి ఆయన వాహనాన్ని ఆపి ఫైన్ వేశాడు.
దీంతో మరో పోలీసు అధికారి ఫైన్ ని అంగీకరించాడు.అంతటితో ఆగకుండా పోలీసు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.
ఇంతలో ట్రాఫిక్ పోలీసు ఆయన్ను వెంబడించి నడిరోడ్డుపైనే దాడి చేశారు.
ఇక ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారులకు చేరింది.
దీనిపై విచారణ జరిపి త్వరలోనే చర్యలు తీసుకుంటామని రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు.ఘటనపై దర్యాప్తు చేపట్టామన్న ఆయన దోషులెవరో తేల్చి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.