తెలుగులో ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నా తెలుగమ్మాయిలకు సినిమాల్లో అవకాశాలు తక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే.కన్నడ, తమిళ, మలయాళ హీరోయిన్లు తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సంపాదించుకుంటే తెలుగు హీరోయిన్లను మాత్రం టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు.
విచిత్రం ఏమిటంటే కొందరు తెలుగు హీరోయిన్లు ఇతర ఇండస్ట్రీలకు వెళ్లి సత్తా చాటారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనన్య ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువగా రావడం గురించి మాట్లాడుతూ తెలుగమ్మాయిలు ఆటిట్యూడ్ చూపిస్తారని సినిమాలకు సపోర్ట్ చేయరనే భావన ఉండటంతో తెలుగమ్మాయిలకు టాలీవుడ్ లో అవకాశాలు తక్కువగా వస్తున్నాయని ఆమె అన్నారు.

ఈ సినిమా కొరకు మూడు రౌండ్ల అడిషన్ లో పాల్గొన్నానని ఆ తరువాత హీరో పవన్ కళ్యాణ్ అని తెలిసిందని అనన్య అన్నారు.వకీల్ సాబ్ సినిమాకు ఎంపికైన కొన్ని రోజుల వరకు తనకు నమ్మకం కలగలేదని ఆమె అన్నారు.తెలుగమ్మాయిలకు వకీల్ సాబ్ ఒక ఆశ ఇచ్చిందని అనన్య పేర్కొన్నారు.వకీల్ సాబ్ మూవీలో తాను అమాయకమైన యువతి పాత్రలో నటించానని అనన్య వెల్లడించారు.
దర్శకుడు శ్రీరామ్ వేణు మల్లేశం సినిమాలో తన నటన చూసి ఈ సినిమా అడిషన్స్ కోసం పిలిచాడని అనన్య అన్నారు.పవన్ కళ్యాణ్ నుంచి తాను చాలా విషయాలను నేర్చుకున్నానని తన డైలాగ్ డెలివరీని పవన్ ప్రశంసించారని అనన్య వెల్లడించారు.
వకీల్ సాబ్ సినిమా తరువాత అనన్య నాగళ్ల మరిన్ని ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.అనన్యతో పాటు అంజలి, నివేదా థామస్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.