టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ గా నిలబడి.
ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసిన సంగతి తెలిసిందే.రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ గెలిచిన గాని అనంతపురం జిల్లాలో తాడిపత్రి మున్సిపాలిటీ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కైవసం చేసుకుంది.
దానికి ప్రధాన కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వం అని అందరూ చెప్పడం జరిగింది.దీంతో ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా .ప్రజలకి ఆయన కి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల సిపిఐ కాలనీ లో జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటించిన సమయంలో ఆ కాలనీవాసులు ….తమకు రోడ్డు వేయాలని కోరారు.వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి రేయ్ ఇప్పుడు పనులు అడుగుతారరా.? నా కొడకల్లారా మీకు అలా అడిగే హక్కు లేదు.!, మీరు డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే నేను మీకు పనులు చేయాలి.
అంటూ ప్రజలనుద్దేశించి కామెంట్ చేశారు.ఎలక్షన్ సమయంలో నీతిగా నిజాయితీగా ఓటు వేస్తే ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు.
మీరు డబ్బులు తీసుకుని ఓటు వేసి, ఇప్పుడు ప్రశ్నించే హక్కు కోల్పోయారని పేర్కొన్నారు.ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవటంతో తాను మాట్లాడిన దానిలో తప్పేమీ లేదని .ప్రజలు నీతిగా నిజాయితీగా ఉంటే ప్రజాప్రతినిధిని కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు వారికీ ఉంటుందని, అదే వాళ్లకి చెప్పినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
.