సినిమా ఇండస్ట్రీ అనేది సముద్రం లాంటిది దాంట్లో కి ఒకసారి అడుగు పెడితే ఇక్కడ ఏదో ఒకటి తేల్చుకోవాలి తప్ప బయటకి మనం వెళ్లాలనుకున్నా వెళ్ళలేము.అలాంటి పరిస్థితుల్లో చాలా మంది హీరోలు కూడా వచ్చి ఒక స్థాయి హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో పాతుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అలాగే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ మంచి గుర్తింపును సాధించుకున్నారు.అలాగే హీరోయిన్స్ కూడా చాలామంది వచ్చి హీరోయిన్ గా గుర్తింపు పొంది అవకాశాలు తగ్గిపోయిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు పిల్లలు పుట్టే వాళ్లు కొంచెం పెద్దయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోలకు తల్లులుగా నటిస్తూ ఇండస్ట్రీలో వాళ్లవాళ్ళకంటూ మంచి గుర్తింపు సాధించికుంటూ ముందుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో ముందు డిస్ట్రిబ్యూటర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత ప్రొడ్యూసర్ గా మారి నష్టపోయి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు వారు ఎవరంటే గిరి.

ఈయన పేరు ఏ.ఎల్.ఎన్ రెడ్డి వీళ్లది నెల్లూరులోని వెంకటగిరి ఊరు పేరు ఆయన పేరు గా మార్చి గిరి అని పిలవడం స్టార్ట్ చేశారు.మొదట్లో ఈయన సినిమాల మీద ఉన్న ఇంటరెస్ట్ తో మద్రాసు వెళ్లి అక్కడ ఒక హోటల్లో సర్వర్ గా చాలా రోజుల పాటు అక్కడే పని చేసుకుంటూ వచ్చారు అయితే తెలుగు వ్యక్తి అయిన పెద్దరెడ్డి గారి వైన్స్ లో సూపర్ వైజర్ గా చాలా రోజులపాటు చేశారు.అలాగే మణిరత్నం లాంటి దర్శకుడి దగ్గర ఘర్షణ సినిమాకి దర్శకత్వ విభాగంలో పని చేశారు.
అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ ఇక్కడ కొన్ని సినిమాలకి దిల్ రాజు తో కలిసి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.ఆ తర్వాత నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిన సుధాకర్ రెడ్డి గారి సహాయంతో నితిన్ తీసిన దిల్ సినిమా కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
ఆ తర్వాత దిల్ రాజుకి గిరికి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు,విడిపోయిన తర్వాత గిరి రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమా కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు సినిమా బాగానే అడినప్పటికీ డబ్బులు మాత్రం పెద్దగా రాలేదనే చెప్పాలి. దాంతో గిరి కొంతమేరకు నష్టపోయారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో గిరి చాలా నష్టాన్ని చవి చూశాడు మొత్తానికి మళ్ళీ ఎన్టీఆర్ తో ఉన్న సన్నిహిత్యం వలన నా అల్లుడు అనే సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించినప్పటికీ అదికూడా డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీలో లేకుండా వెళ్ళిపోయాడు.కానీ అతనితో పాటు ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు మాత్రం వరుస హిట్లు కొట్టుకుంటూ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగిపోయాడు.గిరి చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్ కి వచ్చి మళ్లీ సినిమాలను చేస్తాను అని మీడియా ముందు కి వచ్చి చెప్పాడు చిన్న ప్రొడ్యూసర్లు తన దగ్గరికి వచ్చి తనతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే మంచి సినిమాలు చేయడానికి నేను ముందుకు వస్తానని ఆయన చెప్పారు అయినప్పటికీ ఆయన బ్యానర్ నుంచి ఒక చిన్న సినిమా కూడా మళ్లీ రాలేదు.దీంతో ఆయన ఎప్పుడు జనాలతో నేను ఇండస్ట్రీకి ఏమీ తీసుకురాలేదు ఎక్కడ సంపాదించింది ఇక్కడే పోగొట్టుకున్నాను అని చెబుతూ ఉంటాడు.
కానీ ఇద్దరు ఫ్రెండ్స్ గా వచ్చినప్పుడు దిల్ రాజు టాప్ ప్రొడ్యూసర్ గా ఎదగడం తను మాత్రం ఫెయిల్ అయిపోయి ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.గిరి మాత్రం మళ్ళీ సినిమాలు తీసి తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా రాణిస్తానని చెప్తున్నారు.
చూద్దాం మరి ఆయన ఏ ఏ సినిమాతో మళ్ళీ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో అడుగుపెడతారో.