రేపు విజయవాడ కి పవన్ కళ్యాణ్..!!

నిన్నటితో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించే కొనే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఏర్పాటు చేస్తూ ఉంది.

 Pawan Kalyan To Visit Vijayawada Tomorrow Janasena,pawan Kalyan, Vijaywada ,munc-TeluguStop.com

ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తూ ఉంది.ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పట్టణంలో పడమటలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాబోతున్నారు.రేపు ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్యలో పడమటలంకలో కొమ్మ సీతారామయ్య జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులో ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు  జనసేన పార్టీ సోషల్ మీడియా లో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇదిలా ఉంటే పార్టీ గుర్తులపై జరగబోతున్న ఈ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని ప్రధాన పార్టీలు ఎవరికి వారు వ్యూహాలు వేసుకొని ప్రచారం చేశారు.దీంతో ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు ప్రజలు ఇస్తారు అన్నదానిపై అందరూ ఆసక్తికరంగా గమనిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube