ప్రస్తుతం ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వారు అసెంబ్లీకి వెళ్లే సమయంలో, లేక వారు వారి నియోజక పర్యటన చేస్తున్న సమయంలో వారి కాన్వాయ్ లో దాదాపు పదికిపైగా వాహనాలు ఉండేలా చూసుకుంటూ ఉంటారు.అయితే తాజాగా సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే గుర్రంపై అసెంబ్లీకి వచ్చారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ జార్ఖండ్ అసెంబ్లీకి గుర్రంపై వచ్చారు.దీంతో ఆ గుర్రం వెనకాల భద్రతా బలగాలు కూడా పరుగులు తీశాయి.
ఈ విషయాన్ని గ్రహించిన మీడియా బృందం కూడా ఆమె వెనకాల పరుగులు తీశాయి.ఇకపోతే ఆ ఎమ్మెల్యే ని మీడియా వారు ఈ గుర్రం ఏంటని.
, ఈ గుర్రం ఎక్కడి నుంచి వచ్చిందని.?! వివిధ ప్రశ్నలు సంధించారు ఆవిడ అసలు విషయం చెప్పుకొచ్చింది.అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రవి రాథోడ్ తనకు ఈ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడని ఆవిడ తెలిపింది.తాను ఢిల్లీలో యుపిఎస్సి కోసం ప్రయత్నాలు చేసిన సమయంలో తాను గుర్రపు స్వారీ నేర్చుకున్నాను అని ఆ సమయంలో అతడు తనకు తెలుసు అని చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా రాథోడ్ తాను ఎమ్మెల్యే అయ్యాంనని తెలుసుకుని ఈ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడని.అది నిజంగా ఆశ్చర్యం వేసిందని చెప్పుకొచ్చింది.ఇకపోతే రవి rathod విషయానికి వస్తే ఆయన భారత సైన్యం లో రెజిమెంట్ కమాండెంట్ గా పనిచేసి అర్జున అవార్డును గెలుచుకున్నారు.
ఇకపోతే అంబా ప్రసాద్ కు వచ్చిన బహుమతి గుర్రం రాజా జాతికి చెందిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి గుర్రాలు కేవలం మహారాజా వర్గానికి చెందిన వారే ఉపయోగిస్తారని వారు చెబుతున్నారు.ఇందులో భాగంగానే ఎమ్మెల్యే మాట్లాడుతూ.
తనకి గుర్రపుస్వారీ పట్ల మక్కువ ఉన్నందున ప్రతిరోజు తప్పనిసరిగా దీనిపై గుర్రపుస్వారీ చేస్తానని, అలాగే గుర్రపుస్వారీ చేసేందుకు తాను యువతను ప్రోత్సహిస్తున్నానని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఎమ్మెల్యే గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.2019లో జార్ఖండ్ రాష్ట్రంలోని బార్మ గాన్ ప్రాంతం నుండి అంబా ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.