ప్రజలకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఎన్ని పధకాలు పెట్టిన ఊపయోగం ఉండదు.అవి సరిగ్గా అమలవుతూ వాటి వల్ల ప్రజలు బాగుపడ్దప్పుడే ఆ పధకాలకు అర్ధం ఉంటుంది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న కొన్ని పధకాల వల్ల ప్రజల్లో సోమరితనం పెరిగిపోతుందనే ప్రచారం జరుగుతుంది.
ప్రజలకు ఆదాయం వచ్చే మార్గాలు చూపాలి కానీ ఉచితంగా అందించే ప్రతి పధకం వల్ల ఆ పధకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ నేతలు లాభపడతారు గానీ వాటి లబ్ధి దారులు మాత్రం చేతకాని వారిలా తయారై అవినీతి పాలకులకు చేయుతనిస్తారనేది మేధావుల మాట.ఇకపోతే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకం ఇంటివద్దకే రేషన్.కానీ ఈ పధకం సరైన నిర్వహణ లేక అబాసు పాలవుతుందట.
ఈ వాహనాల నిర్వహణ తమకు భారంగా మారిందని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన పలువురు ఆపరేటర్లు తమ వాహనాలను తహసీల్దారు కార్యాలయంలో అప్పగించేశారట.ఇకపోతే రేషన్ వాహనాల నిర్వహణకు ప్రభుత్వం నుండి రూ.21 వేలు వస్తున్న గానీ అవి ఇంధనం, హమాలీ ఖర్చులతో పాటు వాహన ఈఎంఐలకే సరిపోతుండటం, ప్రభుత్వం నుంచి రాయితీ కూడా లభించక పోవడం వల్ల గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అందువల్లే ఈ వాహనాలు తిరిగిచ్చేశామని వెల్లడించారు.