రేపు విజయవాడ కి పవన్ కళ్యాణ్..!!

నిన్నటితో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించే కొనే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఏర్పాటు చేస్తూ ఉంది.

ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తూ ఉంది.

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది.ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పట్టణంలో పడమటలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాబోతున్నారు.

రేపు ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్యలో పడమటలంకలో కొమ్మ సీతారామయ్య జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులో ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు  జనసేన పార్టీ సోషల్ మీడియా లో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇదిలా ఉంటే పార్టీ గుర్తులపై జరగబోతున్న ఈ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని ప్రధాన పార్టీలు ఎవరికి వారు వ్యూహాలు వేసుకొని ప్రచారం చేశారు.

దీంతో ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు ప్రజలు ఇస్తారు అన్నదానిపై అందరూ ఆసక్తికరంగా గమనిస్తున్నారు.

ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!