టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరో సత్యదేవ్.లాక్ డౌన్ కాలంలోనే తెలుగులో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరో ఎవరంటే కచ్చితంగా ఇతని పేరే వినిపిస్తుంది.
అలాగే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో లాక్ డౌన్ కాలంలో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇదిలా ప్రస్తుతం సత్యదేవ్ ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇతర హీరోల సినిమాలలో నటిస్తూనే మరో వైపు హీరోగా కూడా ఓ నాలుగు సినిమాల వరకు కమిట్ అయ్యి ఉన్నాడు.
ఇదిలా ఉంటే తమన్నాకి జోడీగా గుర్తుందా శీతాకాలం అనే సినిమా షూటింగ్ లో ఇన్ని రోజులు పాల్గొన్నాడు.ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి వచ్చేసింది.
మరో వాపు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా స్టార్ట్ చేశాడు.దీంతో పాటు బ్లఫ్ మాస్టర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
సి కళ్యాణ్ నిర్మాతగా గోపీ గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా గాడ్సే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని గోపి గణేష్ తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.
ఈ విషయాన్ని హీరో సత్యదేవ్ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశాడు.గాడ్సే షూటింగ్ మొదలైంది.
ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది అని ట్విట్టర్ లో సత్యదేవ్ పోస్ట్ పెట్టాడు.