టాలీవుడ్ ప్రస్తుతం ఉన్న బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి.ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే వస్తున్నాయి.
అలాగే కాంబినేషన్స్ చూసుకొని సినిమాలని మైత్రీ నిర్మాతలు చేస్తున్నారు. స్టార్ హీరో, స్టార్ దర్శకుడు కాంబోలో మూవీలు ప్లాన్ చేస్తున్నారు.
దీంతో ఆటోమేటిక్ గా సినిమా రిలీజ్ కి ముందే బిజినెస్ అయిపోతుంది.ఈ కారణంగా వీరు తెరకెక్కిస్తున్న సినిమాలతో నష్టపోవడం అంటూ జరగడం లేదు.
ఒక వేళ సినిమా ఎవరేజ్, ఫ్లాప్ అయినా ముందే బిజినెస్ జరిగిపోవడంతో పెద్దగా నష్టాలు లేకుండా సేఫ్ గా బయటపడుతున్నారు.అలాగే సక్సెస్ ఫుల్ దర్శకుడు, సక్సెస్ ఫుల్ హీరోలు ఉన్నారంటే ముందుగానే వారికీ అడ్వాన్స్ లు ఇచ్చి కమిట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇలా ఇప్పటికే చాలా మంది దర్శకులని మైత్రీవారు లైన్ లో పెట్టారు.అలాగే ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల మీద ఫోకస్ పెట్టింది.
వాటి ద్వారా అయితే అదే బడ్జెట్ తో ఎక్కువ బాషలలో రిలీజ్ చేయడం ద్వారా సినిమాకి ఎక్కువ బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు.
మరో వైపు ఇతర బాషలలో కూడా ఎంట్రీ ఇవ్వడానికి మైత్రీ నిర్మాతలు రెడీ అవుతున్నారు.
దానికిగాను ఇప్పటికే ఆయా బాషలలో స్టార్ హీరోల మీద ఫోకస్ పెట్టారు.కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ తో సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నారు.దానికోసం ఇప్పటికే అతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చి బుకింగ్ చేసుకోవడం జరిగింది.అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే తెలుగు సినిమాలు చేస్తూనే వీటిని కూడా త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి మైత్రీ టీం రెడీ అవుతుందని బోగట్టా.