ఇదేం అన్యాయం...బిడెన్ వ్యతిరేకత ఓటర్లకు మైక్రోసాఫ్ట్ షాక్..!!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన తరువాత అధికారం బిడెన్ కు దక్కుతుందని తేలడంతో ట్రంప్ ఒక్క సారిగా ఎన్నికల సరళిపై విమర్శలు గుప్పించారు.అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందని, తనకు అన్యాయం జరిగిందని రీ కౌంటింగ్ పెట్టాల్సిందే అంటూ కోర్టులకు ఎక్కారు ట్రంప్.

 Microsoft Suspends Funds To Lawmakers Who Opposed Joe Biden, Microsoft , Joe Bi-TeluguStop.com

ట్రంప్ మద్దతు దారులు ఎంతో మంది బిడెన్ గెలుపుకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు కూడా వేశారు.అయితే అవన్నీ నిరాధార ఆరోపణలు అంటూ కోర్టులు కూడా కొట్టేశాయి.

దాంతో ట్రంప్ బిడెన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ బిడెన్ కు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే


ట్రంప్ వర్గంలో వివిధ రాష్ట్రాల నేతలు, చట్ట సభ్యులు, వివిధ సంస్థలు ఉన్నాయి.

ట్రంప్ కు మద్దతుగా నిలిస్తూ బిడెన్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎంతో మంది బహిరంగంగానే బిడెన్ పై ఆరోపణలు చేస్తూ వ్యతిరేకించారు.ఇప్పుడు అలాంటి వాళ్ళందరిని మైక్రోసాఫ్ట్ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది.

బిడెన్ గెలుపును వ్యతిరేకిస్తూ వచ్చిన వారందరికీ తమ నుంచీ అందే సాయాన్ని నిలిపెస్తున్నట్టుగా ప్రకటించింది.

బిడెన్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ సాయం అందించమని తేల్చి చెప్పేసింది.

ఈ మేరకు మైక్రోసాఫ్ట్ పొలిటికల్ వింగ్ టీమ్ ఓ ప్రకటన చేసింది.బిడెన్ వ్యతిరేకులకు 2022 నుంచీ సాయం అందదని ప్రకటించింది.గడిచిన నాలుగేళ్ల కాలంలో తాము ఇచ్చిన విరాళాలు ఎలక్టోరల్ కాలీజీలో వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారికి వెళ్లాయని ఇకపై అలాంటి తప్పులు చేయబోమని తెలిపింది.పారదర్సకంగా ఓట్లు వేసే సంస్థలకు, రాష్ట్రాలకే తమ సాయం అందిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ స్మిత్ ప్రకటించారు.

అయితే మైక్రోసాఫ్ట్ తీరుపై పలు సంస్థలు మండిపడుతున్నాయి.సంస్థలను నమ్ముకుని ఎంతో మంది ఉంటారని, వారందరినీ దృష్టిలో పెట్టుకుంటే మైక్రోసాఫ్ట్ ఇలాంటి నిర్ణయం తీసుకునేది కాదని విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube