గత ఎన్నికల్లో చాలామంది రాజకీయ నేతల వారసులు పోటీ చేసిన విషయం తెలిసిందే.పలువురు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని బరిలోకి దించారు.
అయితే ఇందులో కొందరు వారసులు సక్సెస్ అయితే, మరికొందరు ఫెయిల్ అయ్యారు.అలా ఫెయిల్ అయిన వాళ్ళలో జేసీ దివాకర్ రెడ్డి వారసుడు పవన్ కూడా ఉన్నారు.
అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వారసుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేసి ఓడిపోతే, పవన్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
వీరు టీడీపీ నుంచి పోటీ చేసి జగన్ వేవ్‌లో ఘోరంగా ఓడిపోయారు.
ఓడిపోయాక కొన్ని రోజులు జేసీ ఫ్యామిలీ ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించలేదు.కానీ జగన్, ఆ ఫ్యామిలీని ఏ విధంగా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే.
దీంతో జేసీ ఫ్యామిలీ కూడా పోరాటం చేయడం మొదలుపెట్టింది.అస్మిత్ తాడిపత్రిలో టీడీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తుంటే, పవన్ అనంతపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

అయితే జగన్ ప్రభావం వల్ల అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఊపు తగ్గలేదు.కానీ పార్లమెంట్ స్థానాల పరిధిలో టీడీపీ కాస్త బలపడింది.పలువురు వైసీపీ ఎంపీల పనితీరు సరిగ్గా లేకపోవడం, టీడీపీ నేతలు దూకుడుగా ఉండటంతో కాస్త సీన్ మారినట్లు కనిపిస్తోంది.అనంతపురం పార్లమెంట్ పరిధిలో కూడా ఇదే సీన్ ఉన్నట్లు కనిపిస్తోంది.2019 ఎన్నికల్లో అనంత ఎంపీగా తలారి రంగయ్య గెలిచారు.ఇక ఈయన పార్లమెంట్ స్థాయిలో మంచి పనితీరు కనబర్చడంలో విఫలమైనట్లే తెలుస్తోంది.
వాస్తనికి చెప్పాలంటే అనంత పార్లమెంట్ పరిధిలో తలారి గురించి కొందరు ప్రజలకు తెలియదు.కానీ జేసీ పవన్‌కు మాత్రం ఓ ఇమేజ్ ఉంది.పవన్ ఇప్పటికే పార్లమెంట్‌లో దూకుడుగా పనిచేస్తున్నారు.నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా కసితో పనిచేస్తున్నారు.
ఈ సారి మాత్రం పవన్ గెలవడానికి మంచి ఛాన్స్ దొరికినట్లే కనిపిస్తోంది.