దేవినేని ఉమా పై సంచలన కామెంట్స్ చేసిన వల్లభనేని వంశీ..!!

విజయవాడ గొల్లపూడి సెంటర్ వద్ద టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్షకు దిగి అరెస్టయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కొంతమంది టీడీపీ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగారు.

 Vallabhaneni Vamsi Made Sensational Comments On Devineni Uma, Vallabhaneni Vamsi-TeluguStop.com

దీంతో వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీన్ లోకి వచ్చారు.ఈ సందర్భంగా దేవినేని ఉమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు.? రాకముందు ఏం చెప్పారు.? అన్నదానిపై చర్చకు రావాలని కొడాలి నాని పిలుపునిస్తే ఇంత హడావిడి చేయడం దేనికి అన్నట్టు దేవినేని ఉమా పై సెటైర్లు వేశారు.బెజవాడలో ఎవడు రౌడీయిజం చేస్తారో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు.

సెటిల్మెంట్లు చేసి సొంత బంధువులను చంపి డబ్బు సంపాదించేరకం దేవినేని ఉమా ఫ్యామిలీ అన్నట్టు వంశీ కామెంట్లు చేశారు.ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ వేరు, ప్రస్తుతం ఉన్న టీడీపీ వేరు అన్నట్టు వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ హయాంలో టీడీపీ పార్టీని దేశంలోనే పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దడం జరిగిందని, అదే టీడీపీ పార్టీని ఓ ప్రాంతీయ పార్టీ స్థాయికి తీసుకు వచ్చి మూడు సీట్లకు తెచ్చిన ఘనత చంద్రబాబుది అంటూ వల్లభనేని వంశీ సెటైర్లు వేశారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube