ఖమ్మం లో అమిత్ షా సభ ! వారి చేరికపై ఉత్కంఠ 

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది.ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలిచేందుకు అస్త్ర శస్త్రాలను చేసుకుంటున్నాయి.

 Amit Shah Sabha In Khammam Excitement Over Their Inclusion, Amith Sha, Central-TeluguStop.com

తమ రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టే విధంగా అనేక రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నాయి.అన్ని పార్టీలు తమ బలం నిరూపించుకునేందుకు ఎక్కడికక్కడ భారీగా బహిరంగ సభలు నిర్వహిస్తూ, జనాల దృష్టి తమ పార్టీలకు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇదేవిధంగా బీఆర్ఎస్ ( BRS party )ఇప్పటికే అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించింది.ఇక కాంగ్రెస్ కూడా కొద్ది రోజుల క్రితమే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది .ఆ సభలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకుంది.దీంతో ఇప్పుడు బిజెపి( BJP party ) కూడా స్పీడ్ పెంచింది .ఈ మేరకు ఈరోజు ఖమ్మంలో బిజెపి భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది .రైతు గోస బీజేపీ భరోసా పేరుతో నిర్వహించనున్న ఈ సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి , బిజెపి కీలక నేత హాజరుకానున్నారు.

Telugu Amith Sha, Central, Kishan Reddy, Telangana Bjp-Politics

ఈ సందర్భంగా రైతుల కోసం అనేక హామీలను ఆయన ప్రకటించబోతున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపికి అంతగా పట్టు లేకపోవడంతో,  ఈ ఉమ్మడి జిల్లా ను బిజెపి కంచుకోటగా మార్చుకునేందుకు బిజెపి అగ్ర నేతలు దృష్టి సారించారు.బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహరచన చేశారు.చాలా రోజులుగా బిజెపిలో చేరేందుకు కీలక నేతలే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో,  ఈరోజు అమిత్ షా( Amith sha )సభలోనే భారీగా చేరికలు ఉండబోతున్నట్లు బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ ( Congress )లకు చెందిన కీలక నేతలు 22 మంది బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .అయితే ఎవరా 22 మంది అనేది మాత్రం గోప్యంగా ఉంచారు.ఇక ఈరోజు సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు.సభ ప్రాంగణంలో వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్ లను ఏర్పాటు చేశారు.ఖమ్మం డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరగనున్న ఈ బహిరంగ సభకు కనీసం లక్ష మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.1000 ఆర్టిసి బస్సులను,  ఇతర ప్రైవేటు వాహనాలు,  కార్లు , ట్రక్కులు ,ఆటోలను భారీగా ఏర్పాటు చేశారుఇక అమిత్ షా షెడ్యూల్ విషయానికొస్తే…

Telugu Amith Sha, Central, Kishan Reddy, Telangana Bjp-Politics

ఈరోజు మధ్యాహ్నం 1:30 కి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ ( Amith sha )చేరుకుంటారు.అక్కడి నుంచి భద్రాచలం సీతారాములను దర్శించుకుని హెలికాప్టర్ లో ఖమ్మంకు చేరుకుంటారు.మధ్యాహ్నం 3:45 నుంచి 4 35 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.4:45 నుంచి 5:30 వరకు రాష్ట్ర బీజేపీ నేతలతో కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు.ఆ తరువాత 5:50కి ఖమ్మం నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి 6.20 కి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube