ముగిసిన తమిళ బిగ్ బాస్ 4 సీజన్.. విజేత ఎవరంటే..?!

బుల్లితెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న షో ఏమిటి అంటే అందరూ ఇట్టే చెప్పేస్తారు బిగ్ బాస్ షో.

అది ఏ భాషలో అయినా కానీ ఆ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే తాజాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు పలికింది.ఇక ఈ సీజన్ కు గాను విజేతగా ఆరి అర్జున నిలిచినట్లు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ తెలియజేశారు.

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే లో భాగంగా విన్నర్ అయిన ఆరి అర్జున బిగ్ బాస్ ట్రోఫీని, 50 లక్షలు నగదు బహుమతి హోస్ట్ కమల్ హాసన్ అందించాడు.ఇక తమిళ సీజన్ 4 ఆరి అర్జునతో పాటు టాప్ 5 లో ఫైనల్ లిస్టులో బాలాజీ మురుగదాస్, రమ్యా పాండ్యన్, సోమ్ శేఖర్, రియో రాజ్‌ నిలపడ్డారు.

తమిళ బిగ్ బాస్ 4 ప్రారంభమైనప్పటి నుండి చివరి వరకు కూడా అత్యధిక ఓట్లలో అర్జున్ నే నిలవడంతో పాటు ఎంతోమంది ప్రేక్షకులు అతడే విన్నర్ గా నిలుస్తాడని ఎంతో మంది ముందే ఊహించారు.

Advertisement

ఆరి అర్జున అనుకున్నట్లుగానే విజేతగా నిలిచి అందరి మన్ననలు పొందాడు.ఈ సందర్భంగా హోస్ట్ కమల్ హాసన్ మాట్లాడుతూ అర్జున బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ప్రేక్షకుల అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నడని, అందరి మన్నలను పొందాడని తెలిపాడు.దాదాపు మూడు నెలల పాటు ప్రేక్షకులందరిని అలరించారని చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా అతనిలో ఉండే నిజాయితీ, పోరాటతత్వం, ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలియజేశాడు.అంతేకాకుండా హౌస్ లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ అయ్యేందుకు నామినేట్ అయిన ఆరి అర్జున అతన్ని ఫాన్స్ ఓట్లు వేస్తూ హౌజ్ లో ముందుకు కొనసాగేందుకు సహాయపడ్డారని హోస్ట్ కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు