గంగవ్వ ఇంటి కోసం నాగార్జున అంత ఇస్తున్నారా..?

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని ఆరోగ్య సమస్యల కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఇంటి కోసం బిగ్ బాస్ షోకు వచ్చిన గంగవ్వ హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో నాగార్జునను ఇల్లు కట్టించాలని కోరడం, నాగార్జున కూడా బిగ్ బాస్ షో వేదికపై ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం తెలిసిందే.

 Interesting News Viral About Bigg Boss Contestant Gangavva House, 26 Lakhs, B-TeluguStop.com

బిగ్ బాస్ షో గ్రాంఢ్ ఫినాలే సమయంలో గంగవ్వ ఇంటి పనులు ఇప్పటికే మొదలైనట్లు ఒక వీడియో ప్రసారమైంది.మరోవైపు గంగవ్వకు బిగ్ బాస్ షో నుంచి రెమ్యునరేషన్ కు సంబంధించిన చెక్కులు ఇప్పటికే అందాయి.

బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులలో కొంత మొత్తంతో గంగవ్వ బంగారం కొనుగోలు చేశారు.అయితే గంగవ్వ ఇంటి కోసం మొత్తం 26 లక్షలు ఖర్చు అవుతుందని ఆ మొత్తంతో నాగార్జున ఇంటి కోసం ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.

Telugu Lakhs, Bigg Boss, Gangavva-Movie

ఇప్పటికే గంగవ్వ ఇంటికి సంబంధించిన ప్లాన్ కూడా సిద్ధమైంది.గంగవ్వ కోరిక మేరకు ఆమె సొంతూరు లంబాడిపల్లెలోనే ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.గంగవ్వ విషయంలో నాగార్జున ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఉండటంపై నాగార్జున అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.గంగవ్వ సైతం వీడియోల ద్వారా ఇంటికి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు.

మరోవైపు బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ కు ప్రధాన కారణమైన నాగార్జుననే బిగ్ బాస్ సీజన్ 5 ను కూడా హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది.కరోనా వల్ల ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 ఆలస్యంగా ప్రారంభం కాగా బిగ్ బాస్ సీజన్ 5 మాత్రం వచ్చే ఏడాది జూన్ నుంచి ప్రసారం కానుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube