ప్రస్తుతం భారతదేశంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.మామూలుగా ఎక్కడైనా దేవాలయాలు లేదా పెద్ద పెద్ద సంస్థలలో ఉపయోగించే రొట్టెల తయారుచేసే యంత్రాలను మనం చూస్తూ ఉంటాము.
రొట్టెల తయారీ యంత్రాలను మనం ముఖ్యంగా షిరిడి, అమృత్ సర్, తిరుమల లాంటి చోట్ల మనం చూడవచ్చు.వీటిని ఉపయోగించి మనం అతి తక్కువ సమయంలో ఎంతో మందికి అవసరమయ్యే ఆహారాన్ని క్షణంలో చేయవచ్చు.
ఇక అసలు విషయంలోకి వెళితే…
భారతదేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో వారికి ఆహార వసతి కోసం అక్కడ ఓ రోటి మేకర్ ను ఏర్పాటు చేసుకున్నారు రైతులు.కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని రైతులు ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ నేపథ్యంలో వారికి అవసరమైన వంట సామాగ్రి ను తమతో పాటు వారు తెచ్చుకున్నారు.ఇందులో భాగంగానే తాజాగా వారు వంటలు చేసే భారాన్ని తగ్గించుకోవడానికి కోసం ఏకంగా ఓ భారీ యంత్రాన్ని కూడా రైతులు ఏర్పాటు చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ రోటి మేకర్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ మిషన్ ఒక గంటలో 1500 నుండి 2000 వరకు రోటీలను తయారు చేయగలదు.
ఇంతవరకు మనం దేవాలయాలలో కనిపించే రోటి మేకర్ వాటిని ఎలా తయారవుచేస్తుందో వీడియోలను చూసి ఉంటాము.కాకపోతే, ఇప్పుడు రైతుల వద్ద ఆ రోటి మేకర్ ఎలా పని చేస్తుందో అన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మిషన్ లో కేవలం గోధుమపిండి, కాస్త నీరు అందిస్తే పిండిని ముద్దుముద్దు గా చేసి ఆ తర్వాత దానిని రోటీలుగా చేసి బయటకు ఇస్తుంది.కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ లో ఆమోదించిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అనేకమంది రైతులు వేలసంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్నారు.