ప్రస్తుతం ఎందరో వారి ఇళ్లలో సాధు జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.అయితే మరికొందరు మాత్రం మూగజీవాల పట్ల హీనంగా ప్రవర్తిస్తూ సమాజానికి చీడపురుగులా తయారయ్యారు.
మూగజీవాల పై జాలి, దయ అనేది లేకుండా వాటిపై క్రూరంగా ప్రవర్తించడం మాత్రమే కాకుండా వాటి చావులకు కూడా కారణమవుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను దారుణంగా హింసించిన సంఘటన చోటు చేసుకుంది.
ఆ కుక్కను కారుకు కట్టి నడిరోడ్డుపై లాక్కొని వెళ్ళడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వీడియో ఓ వ్యక్తి షేర్ చేయగా ప్రస్తుతం అది కాస్త నెటిజన్ల కంటపడడంతో అతని పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వేల సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
కేరళ రాష్ట్రంలో ఉన్న ఎర్నాకులం జిల్లాలోని యూసఫ్ అనే 69 సంవత్సరాలు ఉన్న వృద్ధ వ్యక్తి తన పెంపుడు కుక్కతో బాగా విసిగి పోవడంతో దానిని ఎక్కడైనా విడిచి పెడదామని భావించాడు.అయితే ఈ సందర్భంగా అతడు ఆ కుక్కను ఎవరికన్న ఇద్దామని, లేకపోతే ఏ జంతుశాల కన్నా ఇవ్వడం లాంటివి చేయకుండా ఆ కుక్కను ఎక్కడోచోట వదిలిపెట్టాలన్న ఆలోచన లేకుండా తన పెంపుడు కుక్కను కారు వెనుక భాగంలో దాన్ని కట్టేసి కారు నడుపుకుంటూ వెళ్ళాడు.
మెడకు తాడు బిగించచడంతో కారు వేగాన్ని అందుకోలేక ఆ కుక్క చావు బతుకుల మధ్య పోరాడుతోంది.
ఆ కారు వేగాన్ని అందుకోలేక పోయిన కుక్క పూర్తిగా నిస్సహాయ పరిస్థితులలో కింద పడిపోయిన దాని యజమాని మాత్రం ఎటువంటి కనికరం చూపించకుండా అలాగే కారును ముందుకు పోనిచ్చాడు.ఈ సంఘటనను అదే సమయంలో అదే దారిలో వెళ్తున్న బైకర్ సంఘటన మొత్తం వీడియోలో బంధించి ఆ తర్వాత ఆ కార్ ను అడ్డగించాడు.ఇలా ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నించగా.
కుక్కకు కట్టిన తాడును ఆ యజమాని వదిలేసి అక్కడి నుంచి మాయమయ్యాడు.అయితే, ఈ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా సదరు యువకుడు కారు యజమాని పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని జంతు క్రూరత్వం నిరోధక చట్టం కింద నిందితుడిని అరెస్టు చేశారు.
ఆ తర్వాత అతడు బెయిల్ పై బయటకు వెళ్ళిపోయాడు అని పోలీసు అధికారులు తెలియజేశారు.గాయాలపాలైన కుక్కను దగ్గర్లోని పశువుల ఆసుపత్రి కేంద్రానికి తరలించారు.